వరల్డ్‌ ఫేమస్‌గా మారిన పల్లె కోకిల బేబి

11:36 - November 29, 2018

ఎక్కడో పల్లెటూరిలో ఉత్తగా కాలక్షేపానికి పాడుకున్న పాట..ఇప్పుడు ఆమెని వరల్డ్‌ ఫేమస్‌గా మార్చింది. ఆమె పల్లె కోకిల...మట్టిలో మాణిక్యం సింగర్‌ బేబి. ఇప్పుడు ఈమె క్యూలో చాల మంది సింగర్స్‌ వున్నారు. సాధ్యమైనంత తొందర్లోనే రెహమాన్ ని కలవబోతోంది బేబి. అమెరికా - దుబాయ్ లో లైవ్ ఈవెంట్లలో దుమ్ము దుమారానికి రెడీ అవుతోంది బేబి. అసలు విషియానికి వస్తే...ఆ పాట అంత వైరల్ అవుతుందని అనుకోలేదు. నేను బట్టలు ఉతికాక .. పక్కింటికి వెళ్లాను. అక్కడ ఆ అమ్మాయి పాడుతుంటే వీడియో తీసి వైరల్ చేసింది. అనుకోకుండా అవలీలగా పాడేసిన ఆ పాటను అందరికీ చూపించింది... అంటూ ఉబ్బితబ్బిబ్బయిపోతోంది.  `ఓ చెలియా నా ప్రియ సఖియా.. అంటూ గొంతు సవరించింది సోషల్ మీడియాని ఊపేసింది బేబి. ట్రెండింగ్ సెలబ్రిటీ అయిపోయింది. మట్టిలో మాణిక్యం ... పల్లెకోకిల అంటూ కీర్తిని ఆర్జించింది. చిరు - రెహమాన్ - ఎస్ జానకి - బాలు అంతటి వారే ఫిదా అయిపోయారు. రూ.111111 (లక్ష 11వేల 111రూపాయలు) విరాళం ఇచ్చారో నాయకుడు. చిరు ఇంటికి పిలిచి సన్మానించి - లక్ష కానుకిచ్చారు. బేబీకి గాయనిగా శిక్షణనిస్తున్న సంగీత దర్శకులు కోటి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ - ``వాట్సాప్ లో పాట విని షాకయ్యాను. బేబీకి పుట్టుకతో వచ్చిన ప్రతిభ అది. ఇది ఇన్ బిల్ట్ ట్యాలెంట్.  కీర్తి అనేది ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరూ ఊహించలేరు. చిరంజీవి - సురేఖ గారు తన పాట వినాలని ఫోన్ చేస్తే వెంటనే తనని వాళ్ల దగ్గరికి తీసుకెళ్లాను. చిరంజీవి గారు రూ.1లక్ష విరాళం ఇచ్చారు. పాటలు పాడించుకుని విన్నారు. ఏ.ఆర్.రెహమాన్ - బాలసుబ్రమణ్యం - జానకమ్మ అందరూ పిలిచి బేబీని ప్రశంసిస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. బేబి ఏ పాట పాడినా ఆకట్టుకుంటోంది.  5 డిసెంబర్ తర్వాత రెహమాన్ అపాయింట్ మెంట్ ఇచ్చారు. రఘు కుంచె తొలి పాటను  పాడించాడు. బేబి అద్భుతంగా పాడారు. రఘు మ్యూజిక్ బాగా కుదిరింది. రెండో పాటకు నాకు అవకాశమిచ్చారు బేబి. నాకు ఫోక్ మెలోడీ పాటను పాడబోతున్నారు. పరిశ్రమ సంగీత దర్శకులంతా తనతో పాడించుకోవాలి. చదువు లేదు. కేవలం సంగీతం మాత్రమే తనని ఈ స్థాయికి తీసుకొచ్చింది. నేను కొన్ని మెళకువలు చెబుతున్నా. బేబికి అమెరికా - దుబాయ్ నుంచి పిలుపొచ్చింది. అక్కడ లైవ్ ఈవెంట్లు చేయబోతోంది. ఎవరైనా తనకు ప్రోత్సాహకంగా ఎలాంటి సాయం చేయాలనుకుంటే చేయొచ్చు`` అని అన్నారు.  అంతేకాదు మరికొన్ని విషియాలు కూడా బేబీ చెప్పడం జరిగింది. అవేంటంటే...కోటి సర్ బోల్ బేబి బోల్ లో పాట పాడమని అన్నారు. నేను పాడుతున్నానంటే అది అందరి దయ. ఆదరించి నన్ను మీలో ఒకరిని చేసుకున్నారు. హైదరాబాద్ అంటే భయం భయం.. పట్నంలో మంచిగా ఉండరు. లెక్క చేయని స్థితిలో ఉంటారు అని భయపెట్టారు. కానీ ఇక్కడ అందరూ నన్ను దేవుళ్లు దేవతల్లా కనిపిస్తున్నారు. ఇది నిజం. ఈ పయనం భయంగానే సాగింది. నేను పుట్టాక .. రంగంపేట - రాజమండ్రి తప్ప ఎక్కడికీ వెళ్లలేదు. కోటి సార్ నాకు ఫోన్ చేసి ఇక్కడికి రమ్మన్నారు. భయపడొద్దని పాట గురించి అవగాహన కల్పించి .. సంగీతంలో శిక్షణ ఇచ్చారు. తండ్రి - దేవుడు - అన్న అన్నీ తనే. ఈ పాటను వదిలిపెట్టను. పాడతానో లేదో తెలీదు కానీ ప్రయత్నిస్తాను. సార్ .. నడిపించిన బాటలో నడుస్తాను. లేదంటే మా ఊరు వెళ్లిపోతాను. మీ అందరి దీవెనలు కావాలి. మట్టిలో పుట్టి పెరిగాను. కూలి పని చేసుకునేదానిని.  మీ అందరి ఆదరాభిమానులతోనూ ఇలా రాగలిగాను. `మిర్రర్స్` కంపెనీ లక్ష్మి గారు.. పట్టు చీరలు ఇచ్చి రూ.30వేలు విరాళం ఇచ్చారు. నా జుత్తు రింగుల జుత్తు.. ఇది నాది కాదు.. నన్ను మార్చేశారిలా.. కార్ ఇచ్చి ప్రయాణాలకు సాయం చేశారు. హైదరాబాద్ లో దేవతులున్నారు దేవుళ్లున్నారు`` అంటూ ఎమోషన్ అయ్యారు బేబి.