వదినగా మారనున్న వరలక్ష్మీ శరత్‌కుమార్‌

13:16 - December 20, 2018

రెగ్యులర్ హీరొయిన్ గా కాకుండా చాలా ప్రత్యేకమైన పాత్రలతో కోలీవుడ్ లో తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా నెగటివ్ రోల్స్ వైపు మొగ్గు చూపుతోంది. ఈనేపథ్యంలోనే పందెం కోడి 2లో విలన్ గా చేసిన వరలక్ష్మి ఇటీవలే విజయ్ సర్కార్ లో సైతం ఎంత దుర్మర్గానికైనా తెగబడే ముఖ్యమంత్రి కూతురి పాత్రలో మెప్పించింది. అయితే వరలక్ష్మికి తెలుగు స్ట్రెయిట్ మూవీ చేయాలనీ ఎప్పటి నుంచో కోరికట. దాన్ని సందీప్ కిషన్ కొత్త సినిమా తెనాలి రామకృష్ణ బిఏబిఎల్ ద్వారా తీర్చుకోబోతోంది. ఇందులో వరలక్ష్మి పాత్ర హీరొయిన్ కు వదినగా ఉంటుందట. అయితే సాఫ్ట్ కాదండోయ్. నెగటివ్ షేడ్స్ తో ఉంటూనే ఎంటర్ టైన్మెంట్ వచ్చేలా తీర్చిదిద్దినట్టు టాక్. ఈ అంశమే వరలక్ష్మిని ఈ పాత్ర చేసేందుకు ప్రేరేపించిందట. అయితే... సక్సెస్ చూసి చాలా కాలమైన సందీప్ కిషన్ హ్యాట్రిక్ డిజాస్టర్లు పూర్తి చేసుకున్న నాగేశ్వర్ రెడ్డి తెలుగు లో ఏనాడో ఉనికిని కోల్పోయిన హన్సిక ఇలా అందరికి ఇది హిట్ అవ్వాల్సిన అవసరం చాలా ఉంది. మరి స్వింగ్ లో ఉన్న  వరలక్ష్మి తోడయ్యింది కాబట్టి ఆ రకంగా అయినా ఈ తెనాలి రామకృష్ణుడు హిట్ కోడతాడెమో చూడాలి