లేడీ ఓరియంటెడ్‌లో సమంత ఫెయిల్‌

10:51 - October 6, 2018

 లేడీ ఓరియంటెడ్ మూవీ అంటే హీరో లేకుండా హీరోయిన్ సినిమాను తన భుజస్కందాల మీద వేసుకుని నడిపించాల్సి ఉంటుంది.   అలాంటి సత్తా తెలుగులో మొదట విజయశాంతి వుండేది. ఆమె తరువాత ఇప్పుడు అనుష్క అనడంలో ఎటువంటి సందేహం లేదు. తెలుగులో అనుష్క తర్వాత ఎంతో మంది లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేశారు. తాజాగా సమంత కూడా ‘యూటర్న్’ చిత్రంతో లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు శ్రీకారం చుట్టింది. కానీ అది సెక్సెస్‌ కాలేదు.  యూటర్న్ చిత్రంకు పాజిటివ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ మాత్రం నెగటివ్ లో ఉన్నాయి. డిస్ట్రిబ్యూటర్లకు ఈ చిత్రం ఏకంగా మూడున్నర కోట్ల వరకు నష్టాలను మిగిల్చినట్లుగా సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ రాకపోవడంకు కారణం స్టార్ కాస్టింగ్ లేకపోవడమే అంటున్నారు. ఆమద్య అనుష్క హీరోయిన్ గా వచ్చిన భాగమతి చిత్రం మంచి టాక్ ను రాబట్టలేక పోయింది. కాని అనుష్కకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఆచిత్రం భారీగా ఓపెనింగ్స్ రాబట్టింది. కాని సమంతలో ఆ సత్తా లేదని తేలిపోయింది. సమంత ముందు ముందు లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేసినా కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు.