లేటుగా లేస్తున్నాడని...చంపేశాడు!

12:18 - October 9, 2018

మనిషి ఏది అదుపులో పెట్టుకోకపోయినా జరిగే నష్టం కొంత వుంటుంది. కానీ అదే మనిషి తన కోపాన్ని అదుపులో పెట్టుకోకపోతే జరిగే నష్టం ఒక నిండు ప్రాణం అవ్వొచ్చు. అందుకే అంటారు...కోపాన్ని జయించినవాడు, దేన్నయినా జయిస్తాడు అని. కానీ ఒక కసాయి తండ్రి అతని కోపాన్ని అదుపులో పెట్టుకోలేక చేతికొచ్చిన కొడుకును కాల్చి చంపేశాడు. వివారాల్లోకి వెళితే...  రాకేష్ కుమారుడు రాహుల్ ప్రస్తుతం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. దీంతో రాహుల్ ప్రతీరోజూ ఉదయమే లేచి చదువుకోవాలని తండ్రి చెబుతూ వచ్చాడు. అయినా రాహుల్(29) లేటుగా లేస్తుండటంతో తండ్రీకొడుకుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలోనే కుమారునిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన తండ్రి కుమారునిపై  లైసెన్స్‌డ్ గన్‌తో కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన రాహుల్ ఆసుపత్రిలో మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  ఈ ఘటన జార్ఖండ్‌లోని రాంచీకి చెందిన టికలీటోలీలో జరిగింది.