లెక్కలడిగితే బూతులు తిడతారా...?

11:18 - October 11, 2018

తాము లెక్కలు అడిగితే.. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ బూతులు మాట్లాడుతున్నారని, తిట్టడం తెలంగాణ సంస్కృతి కాదని కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. వనపర్తి జిల్లాలోని కొత్తకోటలో బుధవారం కాంగ్రెస్‌ మొదటి విడత ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగేళ్లలో కేసీఆర్‌ చేసిందేమీ లేదని, తెలంగాణలో అభివృద్ధి మచ్చుకైనా కనిపించడం లేదని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మొదలు పెట్టిన ప్రాజెక్టుల వద్ద పైపులు, పంపులు మాత్రమే కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఇదే నేపథ్యంలో...స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతి మాట్లాడుతూ...రాష్ట్రాన్ని అప్పగిస్తే లక్ష కోట్ల అప్పు చేసి చిప్ప చేతికి ఇచ్చిన కేసీఆర్‌ దొరకు ఓటు వేయొద్దని ప్రజలను కోరారు. ప్రచార కమిటీ కోచైర్‌పర్సన్‌ డీకే అరుణ మాట్లాడుతూ...పాలమూరు ప్రాజెక్టులో 95 శాతం పనులు కాంగ్రెస్‌ హయాంలోనే పూర్తవగా, తానే నిర్మించానంటూ కేసీఆర్‌ చెబుతుంటే నవ్వాలో.. ఏడవాలో అర్థం కావడం లేదన్నా రు.