లీకైన ' మహర్షి ' టాప్‌ సీక్రెట్‌

12:19 - November 1, 2018

సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న 25వ సినిమా `మహర్షి` చిత్రీకరణ శరవేగంగా పూర్తవుతున్న సంగతి తెలిసిందే. దాదాపు 40 రోజుల పాటు అమెరికా షెడ్యూల్ అనంతరం తిరుగుపయనం అవుతున్నారు. తదుపరి హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో కొత్త షెడ్యూల్ కి టీమ్ ప్రిపేరవుతోంది. నవంబర్ రెండో వారం నుంచే ఈ షెడ్యూల్ ని తెరకెక్కిస్తారట. `మహర్షి`కి సంబంధించిన టాప్ సీక్రెట్ తాజాగా రివీలైంది. ఈ చిత్రంలో మహేష్ రకరకాల గెటప్పుల్లో కనిపించనున్నారు. అందులో స్టూడెంట్ లైఫ్ - మరో కోణంలో రైతు పాత్రలో కనిపిస్తారని ప్రచారం సాగింది. వీటన్నిటికీ మించి అమెరికాలో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ వోనర్ గానూ దర్శనమిస్తారన్నది తాజా అప్ డేట్. మొత్తానికి మహేష్ లో రకరకాల కోణాల్ని ఎలివేట్ చేసేలా `మహర్షి` పాత్రను వంశీ పైడిపల్లి తీర్చి దిద్దారని అర్థమవుతోంది. మహర్షి స్నేహితుడిగా అల్లరి నరేష్ మరో కీలక పాత్రను పోషిస్తున్నారు. సమ్మర్ లో ఈ చిత్రం రిలీజ్ కానుంది.