లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే...

17:04 - August 12, 2018

ప్రపంచ వ్యాప్తంగా నేడు అనేక మంది ఫ్యాటీ లివర్ వ్యాధి బారిన పడుతున్నారు. శరీరంలో చర్మం తర్వాతి రెండవ అతి పెద్ద అవయవం కాలేయమే! దాదాపు 1,500 గ్రాముల బరువుండే కాలేయం పని తీరు కూడా భారీగానే ఉంటుంది. లివర్ వ్యాధులు రావడానికి ప్రధానంగా అతిగా మద్యం సేవించడం, హెపటైటిస్ ఏ, బీ, సీ, ఈ వంటి వైరల్ ఇన్పెక్షన్లు కారణంగా వస్తున్నట్లుగా నిపుణులు పేర్కొంటున్నారు.లివర్ శరీరంలోని వ్యాధికారక ఇన్‌ఫెక్షన్లతో పోరాడటం, రక్తస్రావం కాకుండా ఆపటం, ఇంతటి కీలకమైన జీవక్రియలను నిర్వర్తించే కాలేయం కూడా కొన్ని కారణాల వల్ల వ్యాధులకు గురవుతూ ఉంటుంది. ఆ వ్యాధులు జన్యుపరంగా, వైర్‌సల వల్ల, క్రమం తప్పిన జీవన విధానం వల్ల సంక్రమిస్తాయని నిపుణులు తెలుపుతున్నారు. సాధారణంగా మన అలవాట్లు మంచిగా వుంటే లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. కానీ అధిక కొవ్వు పదార్ధాలు తింటే అందులో ఉన్న కొవ్వు పోతుంది. మరి అటువంటి ఆహార పదార్ధాలు తీసుకుంటే లివర్ లో తొలగిపోతుందో తెలుసుకుందాం.

పాలు కొవ్వు తీసిన పాలలో ఉండే ప్రోటీన్లు లివర్‌కు మంచి చేస్తాయి. లివర్ డ్యామేజ్ కాకుండా చూస్తాయి. లివర్ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి.

ఆకు పచ్చగా వుండే కూరగాయలు ఆకుపచ్చ రంగులో ఉండే ఆకు కూరలు, కూరగాయలను రోజూ తినాలి. వీటిల్లో ఉండే ఔషధ గుణాలు లివర్‌లో పేరుకుపోయే కొవ్వును కరిగిస్తాయి. లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి. బరువు తగ్గిస్తాయి. లివర్ బాగా పనిచేసేలా చేస్తాయి.

చేపలు చేపల్లో పుష్కలంగా వుండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు లివర్‌లో ఉండే కొవ్వును కరిగిస్తాయి. లివర్ పనితీరును మెరుగుపరుస్తాయి. దీంతో వాపుకు గురయిన మెరుగుపడుతుంది.

ఓట్స్ ఓట్స్‌లో ఉండే పీచు పదార్థం అధికంగా వుంటుంది. ఇది లివర్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. లివర్‌ను సంరక్షిస్తుంది. హానికారక పదార్థాలను బయటకు పంపుతుంది.