లవ్‌ అండ్‌ ఎమోషన్‌తో ' పడిపడి లేచే మనసు ' ట్రైలర్‌

13:31 - December 14, 2018

శర్వానంద్ - సాయి పల్లవి కాంబోలో హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న పడి పడి లేచే మనసు ట్రైలర్ ఈ రోజు గ్రాండ్ లాంచ్ లో విడుదలైంది. ట్రైలర్ విషయానికి వస్తే కథ చూచాయగా చెప్పే ప్రయత్నం చేసాడు దర్శకుడు హను రాఘవపూడి.  "నా పేరు సూర్య .. పేరులోని వెలుగు జీవితంలో మిస్సై సంవత్సరం అవుతోంది. ఏడాది పాటు చీకటితో నేను చేసిన యుద్ధంలో ఇంకా బతికున్నానంటే కారణం వైశాలి" అంటూ శర్వానంద్ వాయిస్ పై ట్రైలర్ మొదలవుతోంది. "ఒక మనిషి గురించి జీవితంలో ఇంతగా తాపత్రయపడటం కరెక్ట్ కాదేమో .. సూర్య అనేవాడు ఇక నా జీవితంలో లేడుగాక లేడు" అంటూ వైశాలిగా సాయిపల్లవి డైలాగ్ తో ట్రైలర్ కొనసాగుతుంది. ఈ ఇద్దరి డైలాగ్స్ ఆ తరువాత ఏం జరగనుందనే ఆసక్తిని పెంచుతున్నాయి. లవ్ .. రొమాన్స్ .. ఎమోషన్ కి ప్రాధాన్యతనిస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకునేలా వుంది. యూత్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అవుతుందనిపిస్తోంది. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా, ఈ నెల 21వ తేదీన థియేటర్లకి రానుంది.  ఇందులో కొత్త హెయిర్ స్టైల్ తో పాటు కొత్త మ్యానరిజం తో శర్వా డిఫరెంట్ గా ఉన్నాడు. స్వంత డబ్బింగ్ తో సాయి పల్లవి మెడికో స్టూడెంట్ గా పర్ ఫెక్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చే పాత్రను మరోసారి దక్కించుకుంది. జెకె ఛాయాగ్రహణం కోల్కతా బ్యాక్ డ్రాప్ ని చక్కగా ప్రెజెంట్ చేయగా విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ ఫ్రెష్ గా ఉంది.