రేపటి నుంచి 22 వరకూ నగరంలోని ఈ ప్రాంతాల్లో 144 సెక్షన్‌

11:59 - November 11, 2018

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చాయి. అన్ని పార్టీల వారూ ప్రచారాలలో మునిగిపోయారు. డిసెంబర్‌ 7న పోలింగ్‌ జరనుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 12 నుంచి 22 వరకూ 15 నియోజక వర్గాలకు సంభందించి అభ్యర్థుల నామినేషన్ల పక్రియ జరగునుంది. దీంతో ఆయా ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధించడం జరిగింది. వివరాల్లోకి వెలితే... ఈ నెల 12 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతున్న దృష్ట్యా నగరంలోని వివిధ ప్రాంతాల్లో 144 సెక్షన్‌ అమలు చేస్తున్నట్లు సీపీ అంజనీకుమార్‌ ప్రకటించారు. 12 నుంచి నామినేషన్‌ ఉపసంహరణ తేదీ 22 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. నగరంలోని 15 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ఉదయం 10 నుంచి సా యంత్రం 6గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. శాంతిభద్రతల పరిరక్షణకు ముందస్తు చర్యల్లో భాగంగా ఆంక్షలు విధించినట్లు సీపీ పేర్కొన్నారు.

•    ఖైరతాబాద్‌ (జోనల్‌ కమిషనర్‌ కార్యాలయం,సెంట్రల్‌ జోన్‌, ఖైరతాబాద్‌)
•    జూబ్లీహిల్స్‌ (తహసీల్దార్‌ కార్యాలయం,షేక్‌పేట్‌, రోడ్‌ నెం.2బంజారాహిల్స్‌)
•    నాంపల్లి (విజయ్‌నగర్‌ కాలనీ, ఆసి్‌ఫనగర్‌, ఆంధ్రా బ్యాంకు దగ్గరి మీ సేవ)
•    ముషీరాబాద్‌ (ముషీరాబాద్‌ తహసీల్దార్‌ కార్యాలయం, లోయర్‌ ట్యాంక్‌బండ్‌)
•    ముషీరాబాద్‌ మలక్‌పేట్‌ (తహసీల్దార్‌ కార్యాలయం, వినయ్‌నగర్‌ కాలనీ చంపాపేట్‌, సైదాబాద్‌)
•    సనత్‌నగర్‌ (తహసీల్దార్‌ కార్యాయలం, అమీర్‌పేట్‌)
•    చార్మినార్‌ (సర్దార్‌ మహల్‌ బిల్డింగ్‌, జీహెచ్‌ఎంసీ కార్యాలయం, చార్మినార్‌)

•    అంబర్‌పేట (తహసీలార్‌ కార్యాలయం, అంబర్‌పేట్‌ మండలం, సీపీఎల్‌ రోడ్‌)

•    కార్వాన్‌ (గోల్కొండ తహసీల్‌, లంగర్‌హౌజ్‌, డిఫెన్స్‌ కాలనీ, కేంద్రీయ విద్యాలయం పక్కన)
•    గోషామహల్‌ (రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం, రూం నెం.6, 4వ అంతస్తు, జీహెచ్‌ఎంసీ కాంప్లెక్స్‌, ఆబిడ్స్‌)
•    చాంద్రాయణగుట్ట (తహసీల్దార్‌ కార్యాలయం, బండ్లగూడ, ఫలక్‌నుమా)
•    సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ (కంటోన్మెంట్‌ సీఈఓ కార్యాలయం, కంటోన్మెంట్‌, సికింద్రాబాద్‌).
•    యాకుత్‌పురా (తహసీల్దార్‌ కార్యాలయం, చార్మినార్‌, ఆర్‌ఓబీ, డబీర్‌పురా)
•    సికింద్రాబాద్‌ (జోనల్‌ కమిషనర్‌ కార్యాలయం, జీహెచ్‌ఎంసీ, సిటీ సివిల్‌ కోర్టు ఎదురుగా వెస్ట్‌ మారేడ్‌పల్లి, సికింద్రాబాద్‌)
•    బహదూర్‌పురా (జీహెచ్‌ఎంసీ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌, చందులాల్‌ బారాదరి)