' రెడ్డి డైరీ ' తో శ్రీరెడ్డి మరో సంచలనం

10:55 - August 21, 2018

సినిమా పరిశ్రమలో క్యాస్టింగ్‌ కౌచ్‌ ఉందంటూ శ్రీరెడ్డి మాటలతో సంచలనం సృష్టించారు. కొన్ని ఫోటోలను సోషల్‌ మీడియాలో విడుదల చేసి సంచలనం సృష్టించారు. టాలివుడ్‌లో శ్రీరెడ్డి వ్యవహారం హాట్‌ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే ఆమె తాజాగా కోలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులు పలువురిపైన తీవ్ర ఆరోపణలు చేశారు. ఇదిలా వుంటే తన జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనలు ఆధారంగా ' రెడ్డి డైరీ ' ని రూపొందిస్తున్నట్లుగా ప్రకటించి మరో సంచటనానికి తెర తీశారు.
' రెడ్డి డైరీ ' పేరుతో శ్రీరెడ్డి స్వీయ చరిత్రను సినిమా చేయనున్నట్లుగా చెన్నై ప్రెస్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. శ్రీరెడ్డి జీవితంలో చోటు చేసుకున్న వాస్తవ సంఘటనల ఆధారంగా ' రెడ్డి డైరీ 'ని రూపొందిస్తామని ఈ చిత్ర దర్శకుడు అల్లావుద్దీన్‌ చెప్పారు.
ఈ సమావేశానికి హాజరైన శ్రీరెడ్డి మాట్లాడుతూ...తనను మోసం చేసిన వారి ఆధారాలు తన దగ్గర వున్నాయని..సమయం వచ్చినప్పుడు బయటపెడతామని చెప్పారు. ' రెడ్డి డైరీ ' చిత్రానికి సహకరిస్తామని డిగర్‌ సంఘం హామీ ఇచ్చిందన్నారు.' రెడ్డి డైరీ ' మూవీతో తన దగ్గరున్న క్యాస్టింగ్‌ కౌచ్‌కు సంబంధించిన వీడియోలను విడుదల చేస్తానంటూ మరో బాంబు పేల్చింది శ్రీరెడ్డి.