రెండిటిల్లో ఒక్కదానికి కూడా చోటు దక్కలేదు

12:10 - September 23, 2018

' రంగస్థలం' , ' మహానటి ' ఈ రెండు సినిమాల్లో ఒక్కటి కూడా ఆస్కార్‌కు ఎంపిక కాకపోవడంపై టాలివుడ్‌ నుంచి అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఈ రెండు చిత్రాలు తెలుగులో బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. ' మహానటి ' చిత్రం లెజెండరీ నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ' రంగస్థలం' మూవీ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కింది. అస్కార్‌కు ఎంపికైన ' విలేజ్ రాక్‌స్టార్స్ ' మూవీ చిత్రయూనిట్‌కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు తెలుగు ప్రేక్షకులు. ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో  ' విలేజ్ రాక్‌స్టార్స్' చిత్రం ఆస్కార్ అవార్డ్‌కి పోటీ పడుతోంది.2019 ఫిబ్రవరి 24న అవార్డుల ప్రధానం ఉంటుంది.