రూ.100 పెట్రోల్‌ కొంటే...5లీటర్లు ఫ్రీ

11:46 - December 6, 2018

రూ.100 పెట్రోల్‌ కొనండీ..5 లీటర్ల పెట్రోల్‌ను ఫ్రీగా తీసుకెళ్లండి. ఇదేంటీ అనుకుంటున్నారా?...కానీ ఇది నిజమే. వివరాల్లోకి వెలితే...' ఎస్‌బీఐ కార్డు లేదా, భీమ్‌ ఎస్‌బీఐ పే ద్వారా  ఇండియన్ ఆయిల్ ఔట్‌లెట్ల పెట్రోలు కొంటే 5 లీటర్ల వరకూ పెట్రోల్ ను ఉచితంగా పొందవచ్చు. అయితే ఇందుకోసం ఇండియన్‌  ఆయిల్‌కు చెందిన ఏ పెట్రోల్‌ బంకులో అయినా కనీసం రూ.100 విలువైన పెట్రోలు కొనుగోలు చేయాలి. 2018 ఏప్రిల్ 1నాటికి 18 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ వయసున్న భారత పౌరులు మాత్రమే ఈ ఆఫర్ కు అర్హులు. ఒక కస్టమర్ మళ్లీమళ్లీ కొనుగోళ్లకు పలు ఎంట్రీలను పంపవచ్చు. అయితే ప్ర తీ ఎస్‌ఎంఎస్‌కు డిఫరెంట్‌ కోడ్‌ ఉండాలి’ అని ఎస్బీఐ తెలిపింది. తాజాగా ఈ ఆఫర్ గడువును ఈ నెల 15వరకూ పొడిగిస్తున్నామని వెల్లడించింది. ఈ మేరకు ఎస్బీఐ ట్విట్టర్ లో స్పందించింది.  అంతేకాదు... ఇలా అందిన ఎస్‌ఎంఎస్‌లలో ఎంపికచేసిన దానికి  50 ,100 ,150, 200 రూపాయలు స్పెషల్‌ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ కూడా ఉంది. ప్రచార కాలంలో ఒక మొబైల్ నంబర్ గరిష్టంగా రెండు సార్లు ఈ ఆఫర్‌ పొందే అవకాశం. ఆఫర్‌ ముగిసిన రెండువారాల్లో విజేతలను ప్రకటిస్తారు. ఈ నగదును ఇండియన్ ఆయిల్ లాయల్టీ ప్రోగ్రాంలో రీడీమ్ చేసుకోవచ్చు. ఆఫర్‌ ఎలా పొందాలంటే...

•    ఇండియన్ ఆయిల్ అవుట్లెట్ల నుండి రూ.100 విలువైన పెట్రోల్  ను కొనుగోలు చేయాలి. అదీ భీమ్‌, ఎస్‌బీఐకార్డు  ద్వారా చెల్లింపులకు మాత్రమే.

•    12 అంకెల యూపీఐ రిఫరెన్స్ నంబర్ లేదా 6 అంకెల అధికార కోడ్‌ను 9222222084కు పంపాలి. 
•    భీమ్‌  ద్వారా చెల్లిస్తే 12 అంకెల రిఫరెన్స్ కోడ్‌ , ఎస్‌బీఐ కార్డుల ద్వారా చెల్లింపుల విషయంలో ఆరు అంకెల కోడ్‌ను నిర్దేశిత నంబరుకు ఎస్‌ఎంఎస్‌ చేయాలి.
•     ఇలా కొనుగోలు చేసిన ఏడు రోజుల లోపు పంపించాల్సి వుటుంది.