' రూలర్‌ గేమ్‌ ' తో కౌశల్‌ ఎలిమినేట్‌ అవుతాడా?

14:20 - September 12, 2018

బిగ్‌ బాస్‌ సీజన్‌ చివరి దశకు వచ్చింది. ఎవరు వుంటారో.. ఎవరు ఎలిమినేట్‌ అవుతారో అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఇందులో కౌశల్‌కు బయట చాలా ఫాలోయింగ్‌ వుంది. రోజు రోజుకూ అది పెరిగిపోతుంది. అయితే కౌశల్‌ని బిగ్‌ బాస్‌ నుండి ఎలిమినేట్‌ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చివరి వారంలో బిగ్‌బాస్‌ కౌశల్‌తో' రూలర్‌ గేమ్‌ 'ఆడిస్తుందంట. ఈ గేమ్‌ లో  హౌస్‌ని బిగ్‌బాస్ సిటీగా మార్చి హౌస్‌మేట్స్‌ని ప్రజలుగా.. కౌశల్‌ని కింగ్‌గా ప్రకటించనుందట. హౌస్‌మేట్స్ అంతా కింగ్ చెప్పినదాన్ని తూ.చ. తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. కాదని ఎదురు తిరిగితే కఠినమైన శిక్షలను కింగ్ విధించాల్సి ఉంటుంది. ఈ టాస్క్ ద్వారా కౌశల్‌ని ఎలిమినేట్ చేసేందుకు లేదంటే అతని క్రేజ్‌ను తగ్గించేందుకు యత్నిస్తోందట బిగ్‌బాస్ టీం. కింగ్‌ని బిగ్‌బాస్ గైడ్ చేస్తూ ఉంటారు. హౌస్‌మేట్స్‌తో చేయించుకోవాల్సిన పనులు.. వారు ఎదురు తిరిగితే విధించాల్సిన శిక్షలు మొదలైన వాటన్నింటినీ బిగ్‌బాస్ గైడ్ చేస్తారు. చేయించే పనులు... విధించే శిక్షల కారణంగా చూస్తున్న ప్రేక్షకుల్లో హౌస్‌మేట్స్‌పై సింపతి వర్కవుట్ అయి... కింగ్‌పై ద్వేషం కలగక మానదు. కాబట్టి కౌశల్‌ని ఈ టాస్క్‌లో భాగంగా కింగ్‌ని చేసి ఎలిమినేట్ చేయాలనో లేదంటే అతని క్రేజ్‌ను భారీగా తగ్గించేయాలనో బిగ్‌బాస్ టీం యోచన చేస్తున్నారని తెలుస్తోంది.  ఈ గేమ్‌ను హిందీలో సీజన్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న గౌతమ్ గులాటీతో ఆడించారు. ఈ టాస్క్ కారణంగా హౌస్‌మేట్స్ అంతా అతనికి యాంటీ అయ్యారు. మిగిలిన హౌస్‌మేట్స్‌పై బయట సింపతి బాగా వర్కవుట్ అయింది. ఫినాలేలో గౌతమ్ విన్నర్ అయినా ఓట్లు మాత్రం భారీగా స్ప్లిట్ అయ్యాయి.