రూటు మార్చిన ఈశా రెబ్బా

14:09 - October 21, 2018

తన మొదటి సినిమా అంతకు ముందు ఆ తర్వాత నుంచి గ్లామర్ షోకు దూరంగా పద్ధతిగా ఉన్న పాత్రలే చేస్తున్న ఈశా రెబ్బ ఇక లాభం లేదనుకుని కాస్త మోడరన్ గా గ్లామర్ టచ్ తో ఫోటో షేర్ చేసుకుని దర్శక నిర్మాతలకు తనో మంచి ఛాయస్ అని అభిప్రాయం కలిగేలా చేస్తోంది. దసరా సీజన్ లో సూపర్ సక్సెస్ కొట్టిన అరవింద సమేత వీర రాఘవలో పూజ హెగ్డేతో పాటు  సెకండ్ హీరొయిన్ గా నటించిన ఈశా రెబ్బ విడుదల ముందు వరకు తన పాత్ర గురించి చాలా చెప్పుకుంది కాని తీరా కథలో అంత ప్రాధాన్యత లేనిది కావడంతో నిరాశ తప్పలేదు. క్రెడిట్ మొత్తం అందరూ పంచుకోగా ఈశాకు మిగిలింది పెద్దగా ఏమి లేదు. దీంతో ఈశా రెబ్బా రూటు మార్చినట్లు కనిపిస్తుంది.  వరంగల్ కు చెందిన తెలుగు అమ్మాయే అయినప్పటికీ ఈషాకు ఇప్పటిదాకా కెరీర్ వేగంగా సాగింది లేదు. దీనికి ముందు చేసిన బ్రాండ్ బాబు కూడా నిరాశే మిగిల్చింది.  ప్రస్తుతం సుమంత్ సరసన నటించిన సుబ్రమణ్యపురం విడుదల  కోసం ఎదురు చూస్తోంది ఈషా.  థ్రిల్లర్ మూవీ కావడంతో హిట్ అయితే బ్రేక్ రావడం గురించి ఆశలు పెట్టుకుంది. తెలుగు అమ్మాయిలు టాలీవుడ్ లో రాణించడం అనే ట్రెండ్ చాలా కాలం నుంచే మాయమైపోయింది. కొందరు కోలీవుడ్ లో పేరు తెచ్చుకున్నారు కానీ ఇక్కడ మాత్రం ఫెయిల్ అయ్యారు. ఆ బాపతులో పడకుండా ఈషా జాగ్రత్త పడుతోంది కాబోలు. సుబ్రమణ్యపురం కాకుండా ఇంకే సినిమా ఒప్పుకున్నట్టు లేదు ఈషా.