రీ షూట్ తప్పదంటున్న దేవరకొండ

11:13 - November 22, 2018

 విజయ్ దేవరకొండ ట్యాక్సీవాలాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.  ట్యాక్సీవాలా అదృష్టం కొద్ది సక్సెస్ అవ్వడంతో విజయ్ దేవరకొండ మరోసారి అజాగ్రత్తగా ఉండొద్దని నిర్ణయించుకున్నాడు.  నోటా - ట్యాక్సీవాలా చిత్రాపై తాను ఎక్కువ ఫోకస్ పెట్టలేక పోయాను అని - ఒకే సారి ఎక్కువ సినిమాలు చేయడం వల్ల ఏ ఒక్కదానిపై శ్రద్ద పెట్టలేక పోతున్నట్లుగా ట్యాక్సీవాలా ప్రమోషన్ ఇంటర్వ్యూలో పేర్కొన్న విజయ్ దేవరకొండ ఇకపై ఒక్కో సినిమా చొప్పున చేసుకుంటూ వెళ్లబోతున్నాను అన్నాడు.  విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘డియర్ కామ్రేడ్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంకు సంబంధించిన షూటింగ్ ప్రారంభం అయ్యి - కొంత పార్ట్ కూడా చిత్రీకరించడం జరిగింది. ట్యాక్సీవాలా చిత్రం తర్వాత కామ్రేడ్ రషెష్ చూసిన విజయ్ దేవరకొండకు కొన్ని సీన్స్ సంతృప్తి ఇవ్వలేదట. దాంతో ఆ సీన్స్ ను తొలగించి మళ్లీ రీ షూట్ చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. విజయ్ దేవరకొండ కోరిక మేరకు ‘డియర్ కామ్రేడ్’ చిత్రంకు సంబంధించిన ఆ సన్నివేశాలను రీ షూట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్మాతలు కూడా బడ్జెట్ పెరిగినా పర్వాలేదు - సినిమా బాగా రావాలనే ఉద్దేశ్యంతో రీ షూట్ కు ఓకే చెప్పారు. రీ షూట్ వల్ల సినిమా బడ్జెట్ పెరగడంతో పాటు సినిమాను అనుకున్నట్లుగా సమ్మర్ లో విడుదల చేయడం వీలు కాకపోవచ్చు అంటున్నారు. సమ్మర్ లో కాకుంటే దసరాకు అయినా సినిమాను విడుదల చేయవచ్చు కాని రీ షూట్ మాత్రం తప్పనిసరి అంటూ విజయ్ దేవరకొండ దర్శకుడికి తేల్చి చెప్పాడట. ప్రస్తుతం స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులతో పాటు - రీ షూట్ కు అంతా సిద్దం అవుతున్నారు. ప్రస్తుతం ఆయన ఏం చెబితే అది నిర్మాతలు - దర్శకులు చేయాల్సిందే. ఎందుకంటే విజయ్ దేవరకొండ టైం నడుస్తోంది. దాంతో పాటు విజయ్ దేవరకొండ జడ్జ్ మెంట్ కూడా సక్సెస్ అవుతుంది.