రీ యూనియన్‌లో ఈ సారి ఆ ముగ్గురూ లేరట!

17:34 - November 15, 2018

సౌత్ ఇండియా సినీ పరిశ్రమలు అయిన తెలుగు - తమిళ - కన్నడ - మలయాళ ఇండస్ట్రీలకు చెందిన 1980 తరం హీరోలు - హీరోయిన్స్  ఇప్పటి వరకు ఎనిమిది సార్లు రీ యూనియన్ అయిన వీరు తాజాగా 9వ సారి రీయూనియన్ అయ్యారు. అయితే ఈసారి  చెన్నైలోని టీ నగర్ లోని ఒక రెసిడెన్సీలో రీ యూనియన్ అయ్యారు. ఈసారి తెలుగు సినీ తారల సందడి కనిపించలేదు. వీరు  ప్రతి ఏడాది రీ యూనియన్ ఏర్పాటు చేసుకుంటున్న విషయం తెల్సిందే. చెన్నైలో జరిగిన రీ యూనియన్ లో కేవలం 22 మంది స్టార్స్ మాత్రమే పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. తెలుగు సినిమా పరిశ్రమ నుండి చిరంజీవి - బాలకృష్ణ - వెంకటేష్ లు డుమ్మా కొట్టారు. ప్రస్తుతం చిరంజీవి సైరా నరసింహారెడ్డి చిత్రంలో బిజీగా ఉన్నాడు. ఇక బాలయ్య ‘ఎన్టీఆర్’ చిత్రంతో పాటు రాజకీయాలతో బిజీ బిజీగా గడిపేస్తున్నాడు. ఇలాంటి సమయంలో రీ యూనియన్ కు హాజరు అవ్వలేక పోయారు. ఇక వెంకటేష్ తన కూతురు పెళ్లి పన్నుల్లో ఉన్నట్లుగా సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అలా ఈ ముగ్గురు స్టార్స్ లేకుండానే రీ యూనియన్ కార్యక్రమం జరిగి పోయింది. ఈసారి రీ యూనియన్ అంతా లేక పోవడంతో సింపుల్ గా జరిగినట్లుగా తెలుస్తోంది. వచ్చేసారి 10వ రీ యూనియన్ కనుక ఖచ్చితంగా అందరు వస్తారనే నమ్మకం వ్యక్తం అవుతుంది.