రిలీజైన సవ్వసాచి టీజర్‌

10:54 - October 1, 2018

అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన ' సవ్వసాచి ' మూవీ టీజర్‌ ఈరోజు (సోమవారం) రిలీజ్‌ అయింది. అయితే ఇందులో చైతూ డైలాగ్‌తో టీజర్‌ మొదలైంది. ఆ డైలాగ్‌ చాలా బాగా ప్రేక్షకులను ఆకుట్టకుంది. ఏకకాలంలో రెండు చేతులతో ఏ పనైనా అవలీలగా చేయగలిగే వారిని సవ్యసాచి అంటారు. భారతంలో అర్జునుడికి ఆ పేరు ఉంది. అర్జనుడు తన రెండు రెండు చేతులతోనూ బాణాలను సంధించగలడు అందుకే ఆయనను సవ్యసాచి అంటారు. ఇంతటి పవర్ ఫుల్ నేమ్‌ను చందు మొండేటి తన మూవీ టైటిల్‌గా ఫిక్స్ చేశారు.  ' మామూలుగా ఒక తల్లి రక్తం పంచుకుని పుడితే.. అన్నదమ్ములంటారు. అదే ఒకే రక్తం ఒకే శరీరం పంచుకుని పుడితే అది అద్భుతం అంటారు ' అంటూ నాగ చైతన్య చెప్పే వాయిస్‌ ఓవర్‌తో టీజర్ స్టార్ట్ అవుతుంది. '   కనిపించని అన్నని.. కడదాకా ఉండే కవచాన్ని..  ఈ సవ్యసాచిలో సగాన్ని'  అంటూ చైతు చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. వాయిస్ ఓవర్‌ని బట్టి చూస్తే పైకి కనిపించని.. ఒకే శరీరంతో ఉన్న కవలల కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందినట్టుగా తెలుస్తోంది.  టీజర్‌ని బట్టి చూస్తే ఇది ఇప్పటి వరకూ రానటువంటి డిఫరెంట్ కథతో తెరకెక్కినట్టు కనిపిస్తోంది.ఏది ఏమైనా ఈ సినిమా డిఫరెంట్ కథతో తెరకెక్కిందనడంలో ఏమాత్రం సందేహం లేదు.