రామ్‌ చరణ్‌ చాలా ప్రెజర్‌ తట్టుకుంటున్నాడట! ఎందుకో?

13:32 - November 28, 2018

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ రంగస్థలం ఇండస్ట్రీ హిట్ తర్వాత కొత్త ఉత్సాహంతో కనిపిస్తున్నాడు.  నిజానికి చరణ్ పైకి కనిపించేది ఎలా ఉన్నా లోపల మాత్రం విపరీతమైన ఒత్తిడిని బాలన్స్ చేస్తున్నాడన్న మాట వాస్తవం.అసలు ఆ ఓత్తిడికి కారణమేమిటో?, అంత ఒత్తిడి దేనికి పడుతున్నాడో? తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్దాం...వినయ విధేయ రామ షూటింగ్ ఇంకా పూర్తి కాకుండానే ఆర్ ఆర్ ఆర్ కోసం తారక్ తో కలిసి రాజమౌళి మల్టీ స్టారర్ యాక్షన్ సీక్వెన్స్ కోసం చెర్రి బిజీగా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆ ఎపిసోడ్ పూర్తి కాగానే తిరిగి వచ్చి వినయ విధేయ రామ ఐటెం సాంగ్ పూర్తి చేయాలి. ఇక మరో కోణంలో చూస్తే నిర్మాతగా రామ్ చరణ్ ఇంతకింతా అనిపించే క్లిష్టమైన బాద్యతలు మోస్తున్నాడు. నాన్న చిరంజీవి హీరోగా అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సైరా షూటింగ్ పీక్స్ లో ఉంది. కొణిదెల బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాకు బడ్జెట్ మంచి నీళ్ళలా ఖర్చవుతోంది. ఇంకా షూటింగ్ చాలా బాలన్స్ ఉంది. పాటల చిత్రీకరణ మొదలుపెట్టలేదు. దీనికి సంబంధించిన వ్యవహారాలన్నీ చరణ్ చూసుకోవాలి. ఇక మరో కోణంలో చూస్తే నిర్మాతగా రామ్ చరణ్ ఇంతకింతా అనిపించే క్లిష్టమైన బాద్యతలు మోస్తున్నాడు. నాన్న చిరంజీవి హీరోగా అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సైరా షూటింగ్ పీక్స్ లో ఉంది. కొణిదెల బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాకు బడ్జెట్ మంచి నీళ్ళలా ఖర్చవుతోంది. ఇంకా షూటింగ్ చాలా బాలన్స్ ఉంది. పాటల చిత్రీకరణ మొదలుపెట్టలేదు. దీనికి సంబంధించిన వ్యవహారాలన్నీ చరణ్ చూసుకోవాలి. మరోవైపు కొరటాల శివ దర్శకత్వంలో చిరు చేయబోయే 152 కోసం బ్యాక్ గ్రౌండ్ లో స్క్రిప్ట్ వర్క్  తో పాటు ప్రీ ప్రొడక్షన్ కూడా జరుగుతోందట. అంటే మొత్తం నాలుగు సినిమా బాధ్యతలు చరణ్ మోస్తున్నాడు. దేనికవే క్రేజీ ప్రాజెక్ట్స్ కావడంతో ఇంత ప్రెజర్ ని ఎలా తట్టుకుంటున్నాడో అంటున్నారు ఫ్యాన్స్. చిరు కూడా ఇంత మల్టీ టాస్కింగ్ చేయలేదని ఈ విషయంలో మాత్రం చెర్రి ఒక అడుగు ముందే ఉన్నాడని చెప్పొచ్చు.