రాతని ఎవరూ మార్చలేరు! : ఎన్టీఆర్‌

11:21 - October 8, 2018

నందమూరి వంశీకులకు వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న విషియం అందరికీ తెలిసిందే. గతంలో హరికృష్ణ కుమారుడు జానకి రామ్‌ రోడ్డు ప్రమాదంలో మరణించారు, తరువాత జూనియర్‌ ఎన్టీఆర్‌కు రోడ్డు ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయట పడ్డారు. ఇటీవల నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించారు. వీటన్నింటిపైన జూనియర్‌ ఎన్టీఆర్‌ ఒక ఇంటర్వ్యూలో స్పందించారు. ఈ యాక్సిడెంట్స్ ను నందమూరి ఫ్యామిలీకి శాపంగా అభిమానులు ఆందోళన చెందుతున్న విషయమై ఎన్టీఆర్ ను ప్రశ్నించిన సమయంలో.. ఈ యాక్సిడెంట్ లను ఆ కోణంలో అస్సలు చూడవద్దని - ఇలాంటి సంఘటనలను విశ్లేషించుకోకుండా ఉండటం బెటర్ అన్నాడు. మా కుటుంబానికే ఎందుకు ఇలా జరుగుతుందో అనే బాధ మొదట వేసిందని - కాని రాతను ఎవరు మార్చలేరని - అంతా కూడా నిమిత్త మాత్రులం కనుక జరిగినదాన్ని సర్దుకుని వెళ్లడమే మనం చేయగలమని - ఎక్కువ ఆలోచించి మన జీవితంలో ముందుకు వెళ్లకుండా ఉండలేమని అన్నాడు. ఎప్పుడో ఒకసారి ఒక పనిచేస్తుంటే ఏదో జరిగిందని..ఇక జీవితంలో ఆ పని చేయకూడదని అనుకుంటే ఎలా?..యాక్సిడెంట్‌ అయిందని నేను కారు నడపడం మానేశానా..లేదు. అయితే కాస్త జాగ్రత్తలు పటిస్తుండాలి. ఈ జీవితంలో ఎప్పుడు ఎలాంటి మలుపు ఉంటాయో అనేది ఎవరికి అర్థం కాని విషయమని - అన్నింటిని అంగీకరిస్తు ముందుకు వెళ్లినప్పుడే అంతా సాఫీగా సాగుతుందని ఎన్టీఆర్ పేర్కొన్నాడు. 

ఇదిలా వుంటే.. ' అరవింద సమేత ' వీరరాఘవ గా ఈనెల 11న ఎన్టీఆర్‌ మన ముందుకు రానున్నారు. త్రివిక్రమ్‌, ఎన్టీఆర్‌ కాంబోలో వస్తున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.