రాజు,రాణి, ఉంగరం

17:40 - August 16, 2018

మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై రవితేజ, శ్రీనువైట్ల కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ' అమర్‌ అక్బర్‌ ఆంటోని '. దీనిలో ఇలియానా కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని నవీన్‌ యేర్నేవి, వై. రవిశంకర్‌, మోహన్‌ (సీవీఎం) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం చిత్ర కాన్సెప్ట్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో ఓ ఉంగరం, ఎఫ్‌ఐడీఓ అనే అక్షరాలతో పాటు రాజు, రాణి బొమ్మలు, అవి టైటల్‌కి లింకై ఉండటం అందరిలోనూ ఆసక్తి క్రియేట్‌ చేస్తుంది. 
' కాన్సెప్ట్‌ పోస్టర్‌ సినిమా కాన్సెప్ట్‌ను తెలియజేయడంతోపాటు అంచనాలను కూడా పెంచిందని ఈ చిత్ర నిర్మాతలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం న్యూయార్క్‌లో ఓ షెడ్యూల్‌ చేస్తున్నట్లు, అక్టోబర్‌ 5న చిత్రం విడుదలవుతుందని చెప్పారు.