రాజీ కుదిరిన ' సర్కార్‌ '

13:16 - November 9, 2018

తమిళ్‌ హీరో విజరు నటించిన ' సర్కార్‌ ' ఈ నెల 6న విడుదలై సక్సెస్‌ ఫుల్‌గా రన్‌ అవుతుంది. అయితే ఈ సినిమాపై పై వచ్చిన వివాదంపై రాజీ కుదిరింది. చిత్రంలోని అభ్యంతరకర సన్నివేశాలు తొలగించేందుకు అంగీకరించారు చిత్ర నిర్మాతలు. జయలలితకు సంబంధించిన సన్నివేశంలో మాటలు వినిపించకుండా బీప్ శబ్దంతో మ్యూట్ చేస్తామని తెలిపారు. ఈ మేరకు ఎడిటింగ్ చేసిన వెర్షన్‌ని శుక్రవారం మధ్యాహ్నం షో (2.30నుంచి థియేటర్స్‌లో ప్రదర్శించనున్నామని థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది. 

సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతున్న ఈ చిత్రం మరోవైపు వివాదాల సుడిగుండంలో చిక్కుకున్న విషియం తెలిసిందే. అన్నాడీఎంకేకు చెందిన కొందరు మంత్రులు ఈ సినిమాను తీవ్రంగా వ్యతిరేకించటమే గాక.. చిత్రంలోని కొన్ని సన్నివేశాలు తమ పార్టీనీ కించపరిచేలా ఉన్నాయని ఆరోపిస్తూ ఆందోళనలు చేపట్టారు. ఈ మేరకు రంగంలోకి దిగిన పోలీస్ యంత్రాంగం భారీ బందోబస్తు చేపట్టింది. ఇదిలా ఉంటే ' సర్కార్‌ 'వివాదమై స్పందించిన రజినీకాంత్, కమల్ హాసన్‌లు.. రాజకీయ పార్టీలు చేస్తున్న ఆందోళనలను తప్పుబట్టారు.