రాజా ది రాజా..అంటున్న విజయ్

15:42 - October 2, 2018

‘అర్జున్ రెడ్డి’ సక్సెస్ తో ఒక్కసారిగా స్టార్ అయిన విజయ్ దేవరకొండ - ‘గీత గోవిందం’ చిత్రంతో అతి సుభంగా వంద కోట్ల క్లబ్ లో చేరాడు. ఇప్పుడు తాజాగా  విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘నోటా’ చిత్రం విడుదలకు సిద్దం అవుతుంది. అక్టోబర్ 5న ఈ చిత్రంను తెలుగు రాష్ట్రాలు - తమిళనాడుతో పాటు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రంతో విజయ్ దేవరకొండ మరో విజయాన్ని దక్కించుకోవడం ఖాయం అంటూ ఆయన అభిమానులు మరియు సినీ వర్గాల వారు చాలా నమ్మకంగా ఉన్నారు. కొంత మంది షాన్స్‌ మాత్రం  సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండను సూపర్ పవర్ స్టార్ అంటూ పిలుచుకుంటున్నారు. అయితే విజయ్ మాత్రం తనకు తానుగా రాజా ది రాజా అంటూ చెప్పుకున్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజా ది రాజా విజయ్ దేవరకొండ అంటూ తనను తాను సంభోదించుకున్నాడు. రాజా ది రాజా కంటే దేవా ది దేవా చాలా బాగుంది కదా అంటూ మీడియా ప్రతినిధి అనగా విజయ్ నవ్వుతూ ఇలాంటివి పెట్టుకుందాం అనేశాడు. విజయ్ అభిమానులు ఇకపై రాజా ది రాజా లేదా దేవా ది దేవా అంటూ పిలవాలని నిర్ణయించుకున్నారు.  నోటా సక్సెస్ అయితే విజయ్ దేవరకొండ స్థాయి మరింతగా పెరగడం ఖాయం.