రాజమౌళీ గారి మల్టీ స్టారర్‌ మూవీలో నేను లేను: కన్నడ హీరో యష్‌

12:20 - November 24, 2018

రాజమౌళి దర్శకుడిగా ఇటీవలే భారీ మల్టీ స్టారర్ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ప్రస్తుతం కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలోని విలన్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండనుంది.  అందువలన యంగ్ విలన్ గా  కన్నడ స్టార్ హీరో యష్ నటించనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై యష్ స్పందించాడు. ''రాజమౌళి గారి మల్టీ స్టారర్లో నేను విలన్ గా చేయడం లేదు. తాజాగా ఈ ప్రాజెక్టు నుంచి ఇంతవరకూ నన్ను ఎవరూ సంప్రదించలేదు. ఒకవేళ ఈ సినిమాలో చేయమని రాజమౌళి గారు అడిగితే చేయడానికి నేను సిద్ధంగానే వున్నాను" అంటూ తన మనసులోని మాటను బయటపెట్టాడు.