రాజకీయాలపై క్లారిటీ ఇచ్చిన శ్రీకాంత్‌

17:48 - November 30, 2018

హీరో శ్రీకాంత్‌ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఫ్యామిలీ ఓరియంటెడ్‌ సినిమాలు. వీటితో శ్రీకాంత్‌ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఎక్కడా కూడా చెడ్డపేరు తెచ్చుకునే విధంగా ఆయన క్యారెక్టర్లను ఎంచుకోలేదు. శ్రీకాంత్ ఇప్పటి వరకు దాదాపుగా 125 చిత్రాలను పూర్తి చేశాడు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల హడావుడి కొనసాగుతున్న నేపథ్యంలో శ్రీకాంత్ ‘ఆపరేషన్ 2019’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. రేపు విడుదల కాబోతున్న ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా తన గురించి మీడియాలో వస్తున్న రాజకీయ పుకార్లపై క్లారిటీ ఇచ్చాడు. హీరోగా అవకాశాలు తగ్గిపోయిన శ్రీకాంత్ వచ్చే ఎన్నికల సమయానికి జనసేన పార్టీలో జాయిన్ కాబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆ వార్తలు పూర్తిగా అబద్దం అంటూ శ్రీకాంత్ తేల్చి చెప్పాడు. తాను రాజకీయాల్లోకి వెళ్లబోతున్నట్లుగా వస్తున్న వార్తలు క్రియేట్ చేసిన గాసిప్స్ అని - తనకు అలాంటి ఆసక్తి లేదని పేర్కొన్నాడు. రాజకీయాల్లోకి వెళ్లే ఎప్పుడు అందులోనే కంటిన్యూ అవ్వాల్సి ఉంటుంది. కాని నాకు అంత ఓపిక లేదని పేర్కొన్నాడు. నేను హీరో అయిన కొత్తలో రామానాయుడు గారి కోసం ప్రచారం చేశాను - ఆ తర్వాత మళ్లీ రాజకీయాల ముచ్చట ఎత్తలేదు. భవిష్యత్తులో కూడా రాజకీయాల జోలికి వెళ్లను అంటూ క్లారిటీ ఇచ్చాడు.