రష్మిక రూటే వేరట...!

15:40 - October 5, 2018

మన గీతా మేడమ్‌ అందరిలాగా కాకుండా తన రూట్‌ను వేరేగా వేసుకుందట!. ఎవరైనా కొంచెం క్రేజ్‌ వచ్చిందంటే చాలు వాల్ల రెమ్యూనరేషన్‌ పెంచుకుంటూ పోతారు. కానీ రష్మిక మాత్రం అలా కాదట!.  రేటు పెంచి కోటి రెండు కోట్లు అంటే చాలామంది నిర్మాతలు దూరం అవుతారని సరసమైన పారితోషికంతో సరిపెట్టుకుంటోందట. మరోవైపు సేమ్ లాజిక్ రిబ్బన్ కట్టింగులకు కూడా పాటిస్తోందని సమాచారం. క్రేజ్ ఉన్న హీరోయిన్లను షాప్ ఓపెనింగ్ లకు పిలుస్తారు కదా.. రష్మిక రేంజ్ హీరోయిన్లు ఒక షాప్ ఓపెనింగ్ కు సహజంగా  రూ. 10 లక్షలు తీసుకుంటారట. కానీ రష్మిక మాత్రం అందులో సగం మాత్రమే పుచ్చుకుంటుందట. జియో లాగా బంపర్ ఆఫర్ ఇస్తే షాప్ ఓనర్లు మాత్రం ఏం చేస్తారు? జియో లాగా బంపర్ ఆఫర్ ఇస్తే షాప్ ఓనర్లు మాత్రం ఏం చేస్తారు? దీంతో తరచుగా రిబ్బన్ కటింగులు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తోందట. సినిమాల విషయం లో కూడా రష్మిక తెలివిగా రెమ్యునరేషన్ పెంచకుండా ఎక్కువ ఆఫర్లు అందిపుచ్చుకుంటూ జోరు పెంచుతోంది.