రజనీకాంత్‌పై గుర్రుమంటున్న నేటిజన్లు...

14:05 - December 11, 2018

రజనీకాంత్ 'నేను సింపుల్ కాదు' అని చెప్పినా అయన సింపుల్ అని.. ఎంతో వ్యక్తిత్వం ఎంతో ఆదర్శమని ప్రచారం సాగుతూ ఉంటుంది. ఆయనకు ఒక సూపర్ స్టార్ లా మాత్రమే కాకుండా ఒక మంచి మనిషిగా బయట ఇమేజ్ ఉంది. ఈమధ్య రజనీ తన కుటుంబం తో పాటుగా '2.0' సినిమాను చెన్నై సత్యం థియేటర్లో చూడడం జరిగింది. అందుకోసం సత్యం సింగిల్ స్క్రీన్ లో సీట్స్ అన్నీ బుక్ చేశారు. ఇక రజనీ తన ఫ్యామిలీతో సినిమా ను చూస్తున్నపుడు కొంతమంది ఫోటోలు తీయడం.. అవి సోషల్ మీడియాలో వైరల్ కావడం చకచకా జరిగాయి. ఈ ఫోటోలలో రజనీ.. తన సతీమణి లత తో పాటుగా మనవడు కూడా ఉన్నాడు.  వీరి వెనక వరుసలో పనిమనిషి నిలబడి సినిమా చూస్తోంది.  సరిగ్గా ఇదే పాయింట్ నెటిజనులకు కోపం తెప్పించింది.  ఎంత సర్వెంట్ అయినా  కూర్చొని సినిమా చూడమని చెప్పొచ్చుగా. పక్కన కూర్చోబెట్టుకోవడం ఇష్టం లేకపోతే రెండు మూడు వరుసలలకు అవతల అయినా కూర్చోమని చెప్ప వచ్చు గానీ అలా నిలబడి సినిమా చూస్తుంటే రజనీ ఎం పట్టించుకోకుండా ఉండడం ఏంటని అంటున్నారు. ఇతర స్టార్ హీరోల విషయంలో అయితే ఇలాంటివి అసలు పట్టించుకోరు గానీ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇలా ప్రవర్తించడం అసలు నచ్చలేదని ఓపెన్ గానే విమర్శిస్తున్నారు. రజనీ చెప్పే నీతులు అనీ సినిమాలకు మాత్రమే పరిమితమా.. రియల్ లైఫ్ లో పాటించడా అంటూ సెటైర్లు వేస్తున్నారు.