రజనీకాంత్‌కు నచ్చిన హీరోయిన్‌ ఆమెనట!

12:35 - December 1, 2018

రజనీకాంత్ కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు వున్నారు. సుదీర్ఘమైన ఆయన కెరియర్లో ఎంతోమంది కథానాయికలు ఆయన సరసన నటించారు. ఆయన నటించిన ఎన్నో సినిమాలు సంచలన విజయాలను సాధించాయి. 'మీకు నచ్చిన బెస్ట్ ఫీమేల్ కో స్టార్ ఎవరు?' అని. ఎంతోమంది స్టార్ హీరోయిన్స్ ఆయనతో కలిసి నటించారు గనుక, వాళ్లలో ఎవరో ఒకరి పేరు చెబుతారు అని అంతా భావించారు. కానీ  ఆయన ఎవరూ ఊహించని విధంగా 'ఫటా ఫట్ జయలక్ష్మి' పేరు చెప్పారు. తనకి నచ్చిన బెస్ట్ హీరోయిన్ ఆమేనని అన్నారు. రజనీకాంత్ తో కలిసి ఆమె కొన్ని సినిమాలు చేసింది.  'జయలక్ష్మి' తెలుగు అమ్మాయి .. 'అంతులేని కథ' సినిమాలో జీవితాన్ని చాలా తేలికగా తీసుకుంటూ ఆమె 'ఫటా ఫట్' అంటూ ఉంటుంది. ఆ మేనరిజం జనంలోకి బాగా వెళ్లడంతో ఆమె 'ఫటా ఫట్ జయలక్ష్మి'గా పాప్యులర్ అయింది.