రంగమ్మత్తకు మరో ఆఫర్‌

11:22 - December 5, 2018

రంగస్థలంలో రంగమ్మత్తగా మంచి పేరు తెచ్చుకుంది అనసూయ. అందులో పాత్రకు తగ్గ అభినయంతో ప్రేక్షకుల మనసులను దోచేసుకుంది. అయితే మరోసారి అనసూయకు ఆఫర్‌ వచ్చింది. అది ఎందులో అనుకుంటున్నారా?...వివరాల్లోకి వెలితే....దిల్ రాజు నిర్మాతగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్ 2' సినిమా రూపొందుతోంది. వెంకటేశ్ .. వరుణ్ తేజ్ కథానాయకులుగా చేస్తోన్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా ముగింపు దశకి చేరుకుంది. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో అనసూయ మెరవనున్నట్టు తెలుస్తోంది. వెంకటేశ్ .. వరుణ్ తేజ్ .. అనసూయలపై ఈ స్పెషల్ సాంగ్ ను చిత్రీకరించనున్నట్టు సమాచారం. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్న సంగీతం ఓ ప్లస్ కానుంది. అయితే గతంలో సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ చిత్రంలో స్టెప్పులేసి అలరించిన అనసూయ ఈ చిత్రంలోనూ ప్రత్యేక గీతంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. అనిల్ రావిపూడి వరుస హిట్లు కొడుతుండటంతో, ఈ సినిమాపై మంచి అంచనాలు వున్నాయి. అంతేకాదు వెంకటేశ్ సరసన తమన్నా .. వరుణ్ తేజ్ జోడిగా మెహ్రీన్ నటిస్తోన్న ఈ సినిమా, నాన్ స్టాప్ నవ్వులతో కొనసాగుతుందని చెబుతున్నారు. నేటి(బుధవారం) నుంచి ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ప్రారంభం కావడంతో పాటు.. అప్‌డేట్స్ కూడా ఇస్తామని చిత్రబృందం మంగళవారం సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.