యువతను ఆకట్టుకునే ప్రేమకు రెయిన్‌ చెక్‌

10:50 - August 23, 2018

శరత్‌ మరార్‌ నార్త్‌ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో స్టోన్‌ మీడియా ఫిల్మ్స్‌ పతాకంపై ఆకెళ్ళ పేరి శ్రీనివాస్‌ స్వీయ దర్శకత్వంలో  'ప్రేమకు రెయిన్‌ చెక్‌' నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అభిలాష్‌, ప్రియ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం గురించి దర్శకుడు ఆకెళ్ళ పేరి శ్రీనివాస్‌ మాట్లాడుతూ..., 'ఒక వ్యక్తి ప్రేమకు రెయిన్‌ చెక్‌ ఇచ్చి కెరీర్‌కి ప్రాధాన్యత ఇవ్వాలని తన జీవితాన్ని ఎలా కాంప్లికేట్‌ చేసుకున్నాడనే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఇది కొత్త తరహా ప్రేమ కథ. ఇందులో యువతను ఆకట్టుకునే అంశాలన్నీ ఉంటాయి. దీపక్‌ కిరణ్‌ సంగీతం అందించిన పాటలు మంచి ఆదరణ పొందుతున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఆకట్టుకుంటుంది. సాంగ్స్‌ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ చిత్రాన్ని ఈ నెల 23న విడుదల చేయాలని ప్రయత్నించాం. కానీ పలు కారణాల వల్ల సెప్టెంబర్‌ 7న విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నాం.  సినిమాలో అభిలాష్‌, ప్రియల కెమిస్ట్రీ ఆడియెన్స్‌ను మంత్రముగ్దుల్ని చేస్తుంది. కెమెరా వర్క్‌, సంగీతం ఒకదానితో ఒకటి పోటీపడుతున్నట్టు సినిమాలో కనిపిస్తుంది. మా చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నా' అని ఆయన తెలిపారు. మౌనకి, సుమన్‌, రఘు కారుమంచి, కిరీటి దామరాజు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: శరత్‌ గురువుగరి.