యాంటీ - రౌడీ ఫ్యాన్స్‌ కూడా ఉన్నారట!

11:35 - October 31, 2018

అర్జున్‌ రెడ్డి, గీతా గోవిందం తో...ఇప్పుడు విజయ్ దేవరకొండ  టాలీవుడ్ లో క్రేజీ హీరో..ఫ్యూచర్ సూపర్ స్టార్ '.. ఈ మాట చెప్తే సగం మంది అంతెత్తున ఎగిరి పడతారు. ఇక సోషల్ మీడియాలో విజయ్ కి రౌడీ ఫ్యాన్స్ తో పాటుగా యాంటి-రౌడీ ఫ్యాన్స్ కూడా భారీ సంఖ్యలోనే ఉన్నారు. ఈ విషయం గురించి కమెడియన్.. విజయ్ దేవరకొండ ఫ్రెండు రాహుల్ రామకృష్ణ ను అడిగితే "నాకు తెలీదు' అన్నాడు.  'అర్జున్ రెడ్డి' తో పాటుగా 'గీత గోవిందం' లో కూడా రాహుల్ నటించిన సంగతి తెలిసిందే. ఎంత పెద్ద స్టార్ హీరోకయినా యాంటి - ఫ్యాన్స్ ఉంటారు.  మహేష్ బాబు - పవన్ కళ్యాణ్ లాంటి స్టార్స్ కూడా ఇందుకు ఎక్సెప్షన్ కాదు. అలాంటిది ఇప్పుడిప్పుడే ఎదుగుతూ ఉన్న విజయ్ దేవరకొండ కు ఎందుకు యాంటి ఫ్యాన్స్ ఉండరు? పైగా మనోడు సాధారణంగా ఉండే మనిషా అంటే.. కాదు. రౌడీ వేషాలు పీక్స్ లో ఉంటాయి. ఆ యాటిట్యూడే తనకు క్రేజీ ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. ఇక అదే ఈ యాంటి - రౌడీ ఫ్యాన్స్ కు కూడా కారణం.