యాంకర్‌గా..శృతి హాసన్‌

11:45 - September 20, 2018

హీరోయిన్‌గా శృతి హాసన్‌ మనందరికీ పరిచయమే. పవన్‌కళ్యాణ్‌, మహేష్‌బాబు లాంటి స్టార్‌ హీరోస్‌తో మంచి హిట్‌ కోట్టిన నటి. అయితే ఇప్పుడు శృతి యాంకర్‌ పాత్రలో కనబడనుంది. త్వరలో తమిళ బుల్లితెరపై ఆమె యాంకర్‌ అవతారంలో దర్శనం ఇవ్వనున్నారు. ఓ టాక్‌ షోతో త్వరలో బుల్లితెర వీక్షకుల మందుకు రానున్నారని, సన్‌ నెటవర్క్‌తో ఈ మేరకు ఒప్పందం జరిగిందని చెన్నై టాక్‌! రెగ్యులర్‌ టాక్‌ షోల తరహాలో కాకుండా శ్రుతి గాయని, సంగీత దర్శకురాలు కనుక... షో ప్రారంభంలో మ్యూజిక్‌ లైవ్‌ పర్ఫార్మెన్స్‌, తర్వాత సెలబ్రిటీలతో సరదా సంభాషణలు ఉండేలా రూపకల్పన చేస్తున్నారట! శ్రుతి స్నేహితురాలు తమన్నాతో పాటు పలువురు సెలబ్రిటీలు ఈ టాక్‌ షోలో సందడి చేయనున్నారని తెలిసింది!!