మోడీ సర్కార్‌ తీరును నిరసిస్తూ రేపు భారత్‌ బంద్‌...!

10:22 - October 25, 2018

అర్ధరాత్రి వేళ సీబీఐ చీఫ్‌ తొలగింపు.. ఆకస్మిక బదిలీలు.. తమవారిని కాపాడుకోవడానికి చేపట్టిన చర్యేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మోదీ సర్కారు తీరును నిరసిస్తూ భారత్‌బంద్‌ నిర్వహించడానికి సిద్ధమయ్యాయి. ఈ బంద్‌ శుక్రవారం ఉండే అవకాశం ఉందని విశ్వసనీయవర్గాల సమాచారం. సీబీఐ స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బతీసేలా మోదీ సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.  అర్ధరాత్రి పూట ఎమర్జెన్సీ తరహాలో ఆపరేషన్‌ నిర్వహించి నాగేశ్వరరావును రప్పించడం, అలోక్‌వర్మ కార్యాలయంపై సోదాలు నిర్వహించడం, అస్థానాపై కేసు విచారణ జరుపుతున్న అధికారులు సహా 13మంది అధికారులను బదిలీ చేయడం, సమాచార ప్రసార శాఖను రంగంలోకి దించి అలోక్‌వర్మపై దుష్ప్రచారం చేయించడం.. వంటి చర్యలన్నీ సీబీఐ మోదీ జేబు సంస్థగా మారిందనే భావన కలగడానికి కారణమవుతున్నాయి. కాగా.. సీబీఐ విషయంలో మోదీ సర్కారు నిర్ణయాలు కాంగ్రెస్‌ పార్టీకి ఆయుధాలనిచ్చినట్లుగా కనిపిస్తోందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

అసలు విషియాలను పరిశీలిస్తే... దేశ ప్రజలు నిద్ర మేల్కొనే సమయానికి జరగాల్సిందంతా గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోయింది. దేశం నెవ్వరబోయింది. రాఫెల్‌ గుట్టురట్టు చేసేందుకు ప్రయత్నిస్తున్న అలోక్‌వర్మను తప్పించటమేమిటన్న ప్రశ్న ముందుకొచ్చింది. ఏపీకి చెందిన సీఎం రమేశ్‌ను ఇరికించేందుకు నకిలీ పత్రాలు సృష్టించిన వారి మీద కన్నెర్ర జేసిన అధికారి అలోక్‌వర్మ కావడం ఇక్కడ ప్రత్యేకత. పైగా అవినీతిని నిరోధించవల్సిన సీబీఐలో నెంబర్‌ 2గా ఉండి ఐదు కోట్ల రూపాయల లంచానికి తెగబడ్డాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న అస్తానా మీద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్న అధికారి అలోక్‌వర్మ, గుజరాత్‌ ' గోద్రా ' కేసు నుంచి మోడీని గట్టెక్కించిన అస్తానాను రక్షించేందుకేనా ఇదంతా? అలోక్‌వర్మ ఉంటే, రాఫెల్‌ గుట్టు రట్టయి మోడీ మెడకు ఉచ్చు బిగుసుకుంటుందన్న భయంతోనే ఈ అర్ధరాత్రి ప్రవాసనం జరిగిందా? అని చర్చ జరుగుతుంది. దీనికి జరిగిన పరిణామాలను బట్టి అవుననే చెప్పక తప్పదు.