మోడీకి రాహుల్‌ సవాల్‌

12:09 - November 18, 2018

' రాఫెల్ ' వివాదంపై మోదీ సర్కార్‌ను గుక్క తిప్పుకోనీయకుండా చేస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈసారి నేరుగా మోదీకి సవాలు విసిరారు. ఫ్రాన్స్‌తో రాఫెల్ డీల్ వివాదం, సీబీఐలో కల్లోలంపై కేవలం 15  నిమిషాల పాటు చర్చకు రావాలని ప్రధానికి రాహుల్ సవాల్ విసిరారు. ఎక్కడైనా , ఏ సమయంలోనైనా, వేదిక ఏదైనా సరే....కేవలం 15 నిమిషాలు నాతో డిబేట్ చేయడానికి రండి. అనిల్ అంబానీ, హాల్, ఫ్రెంచ్ అధ్యక్షుడి ప్రకటన, రాఫెల్ జెట్ల ధరలపై నేను మాట్లాడతాను. ప్రధానే అంతా చూసుకున్నట్టు రక్షణ శాఖ మంత్రి చాలా స్పష్టంగా చెప్పారు. ఎలాంటి నిబంధనలు ప్రధాని పాటించలేదు. ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లో ఎన్నికల ప్రచారం సాగిస్తున్న రాహుల్ మీడియాతో మాట్లాడుతూ, తాను లెవనెత్తిన ప్రశ్నలపై ప్రధాని నోరు మెదిపే పరిస్థితిలో లేరని అన్నారు. అంతకుముందు, ఛత్తీస్‌గఢ్‌లో చేసిన ప్రసంగంలోనూ, మోదీ సర్కార్ బడా పారిశ్రామికవేత్తలకు కొమ్ముకాస్తున్నారంటూ రాహుల్ విరుచుకుపడ్డారు.