మొహమాటం లేకుండా పదే పదే ఫోన్‌ చేస్తాను: సారా అలీఖాన్‌

15:21 - December 19, 2018

ఏ భాష సినీ ఇండస్ట్రీలో అయినా కూడా వారసులు రావడం అనేది చాలా కామన్. స్టార్స్ పిల్లలకు అవకాశాలు అనేవి సునాయాసంగా వస్తాయి . అలాంటిది నాన్న సైఫ్ అలీ ఖాన్ పెద్ద స్టార్ అమ్మ గతంలో పెద్ద హీరోయిన్ నానమ్మ గతంలో పెద్ద హీరోయిన్ అయినా కూడా సారా అలీ ఖాన్ ఆఫర్ల కోసం చాలా కష్టపడినదట. ఈ విషయాన్ని స్వయంగా సారా అలీఖాన్ చెప్పుకొచ్చింది. తండ్రి సాయం లేకుండా వారసత్వంతో కాకుండా తనకు తానుగా ఆఫర్లు సంపాదించుకోవాలనే పట్టుదలతో  అవకాశాల కోసం ఎంతో మంది దర్శకులకు పదే పదే ఫోన్ చేశాను. అలా పదే పదే ఫోన్ చేయడం వల్లే ‘సింబ’ సినిమాలో హీరోయిన్ గా రోహిత్ షెట్టి అవకాశం ఇచ్చారని సారా పేర్కొంది. నాకు కమర్షియల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకోవాలనే కోరిక బలంగా ఉండేది. అందుకే కమర్షియల్ హీరోలకు పెట్టింది పేరైన రోహిత్ షెట్టి గారిని పదే పదే అవకాశం ఇవ్వండి అంటూ ఫోన్ చేసేదాన్ని ఆయన నా పోరు భరించలేక ఈ సినిమాలో ఛాన్స్ ఇచ్చాడంటూ చెప్పుకొచ్చింది. ఈ విషయమై రోహిత్ షెట్టి మాట్లాడుతూ.. సారా నాకు పదే పదే ఫోన్ చేసేది. నాకొక ఛాన్స్ ఇవ్వండి అంటూ రిక్వెస్ట్ చేసేది ఒకానొక సమయంలో నాకు చిరాకు అనిపించేది. ఆమె పదే పదే ఫోన్ చేసి ఆఫర్ కోసం రిక్వెస్ట్ చేయడంతో ‘సింబ’లో ఆమె కు హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చానని చెప్పుకొచ్చాడు. సినిమాల విషయంలో  తాను ఎవరి దర్శకత్వంలో నటించాలనుకుంటే వారిని ఇంప్రెస్ చేసేందుకు ప్రయత్నిస్తానంటూ సారా అలీ ఖాన్ నిర్మొహమాటంగా చెప్పేసింది.