మెదడు చురుగ్గా పనిచేయాలంటే ఇలా చేయాలి

14:08 - August 16, 2018

ఒకే పని పైన ఎక్కువ సేపు కుర్చోవడం, అదే పని గురించి ఎక్కువగా ఆలోచించడం చేసినప్పుడు మెదడులో కొత్త ఆలోచనలు రాక తికమక పడుతూ...మెదడు మొద్దుబారినట్లవుతుంది. ఆ క్షణాల్లో చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి సమయంలో కొద్దిసేపు మెడిటేషన్‌ చేయడం వల్ల మెదడు రీఫ్రెష్‌ అయ్యి చురుగ్గా పనిచేస్తుందట.
మెడిటేషన్‌ చేయడం ఎప్పుడు మొదలు పెట్టినా సత్వర ఫలితం ఉంటుందంటున్నారు పరిశోదకులు. అంటే ప్రతిరోజూ చేసే వాళ్లు కావచ్చు, కొత్తగా మొదటి సారి చేస్తున్న వారు కావచ్చు ఫలితం వెంటనే కనబడుతుంది. 
అమెరికాకు చెందిన '' యాలె యూనివర్సిటీ '', '' స్వర్త్‌ మోర్‌ కాలేజీ '' శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. కాలేజీ విద్యార్థులకు కొంత మందికి మెడిటేషన్‌కు సంబంధించిన ఆడియోలను పది నిమిషాల పాటు వినిపించగా ...క్లిష్టమైన పరీక్షల్లో వారు చక్కటి ప్రతిభను కనపరిచారు. 
కాలేజీ విద్యార్థులను రెండు బృందాలుగా విభజించి ఒక గ్రూపుకు మెడిటేషన్‌ ఆడియోలను, మరొక బృందానికి టెస్టుకు సంబందించిన ఆడియోలను వినిపించారు. మెడిటేషన్‌ ఆడియోలు విన్నవారు ఎక్కువ చురుకుగా ప్రవర్తించారు. 
వారాలు, నెలల తరబడి మెడిటేషన్‌ చేసే వారు మాత్రమే చురుగ్గా వుంటారు అనేది తప్పుు. మొదటిసారి మెడిటేషన్‌ చేసిన వారు కూడా చురుగ్గానే ఉంటారు.