మెదడు చురుగ్గా పనిచేయాలంటే...

13:44 - August 20, 2018

మెదడు చురుగ్గా పనిచేయాలంటే మనం తీసుకునే ఆహారంలో ఈ ఆరు పదార్దాలను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆహార పదార్దాలు జ్ఞాపక శక్తిని పెంచడంతో పాటు మెదడును చురుకుగా ఉంచుతాయి. ఆ పదార్దాలేంటో తెలుసుకుందాం..
ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు మెదడుకు ఎంతో మేలు చేస్తాయి. ఇవి సాల్మన్‌, ట్యూనా వంటి చేపల నుంచి లభిస్తాయి. ఈ ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు గుడ్డు, వాల్‌నట్స్‌లో కూడా పుష్కలంగా ఉంటాయి. 
నాడీ కణాల మధ్య సమన్వయానికి హై టైరీసిస్‌ ప్రోటీన్లు ఎంతగానో ఉపయోగపడతాయి. గుడ్డు, సముద్రపు ఆహారం, డైరీ ప్రొడక్ట్స్‌ల్లో ఈ ప్రోటీన్లు దొరుకుతాయి.
మెదడును ఫ్రీ-రాడికల్స్‌ నుంచి కాపాడేందుకు యాంటీ ఆక్సిడెంట్స్‌ బాగా కృషి చేస్తాయి. గ్రీన్‌టీ, స్టాబెర్రీ, బ్రకోలీ, క్యారెట్‌, వెల్లుల్లి, తృణధాన్యాల్లో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి.
శరీరంలో వున్న అన్ని భాగాల్లాగానే మెదడుకు విటమిన్లు, మినరల్స్‌ అవసరం ఎంతో వుంది. రోజువారి ఆహారం ద్వారా లభించే విటమిన్లు ఖనిజాలతోపాటు విటమిన్‌ సప్లిమెంట్లు కూడా తీసుకోవడం మంచిది.
అన్ని కూరగాయాలు, ఆకు కూరలు, పండ్లు, ఖర్జూరాలు, బీన్స్‌ వంటి వాటిల్లో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. నాడీ కణాలకు గ్లూకోజ్‌ సప్లరు చేయడంలో ఫైబర్‌ పాత్ర కీలకం.