మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో

18:16 - August 16, 2018

మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో హీరో వైష్ణవ్‌ తేజ్‌. మెగా మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ తమ్ముడే ఈ వైష్ణవ్‌ తేజ్‌. చాలా రోజుల క్రితమే వైష్ణవ్‌ ఎంట్రీకి సంబంధించిన పనులు మొదలైనట్టుగా వార్తలు వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం వైష్ణవ్‌ తొలి చిత్ర షఉటింగ్‌ ఎలాంటి హడావిడి లేకుండా ప్రారంభించేశారట. నారా రోహిత్‌, శ్రీవిష్ణు కాంబినేషన్‌లో అప్పట్లో ఒకడుండేవాడు సినిమాను తెరకెక్కించిన సాగర్‌ కె చంద్ర ఈ సినిమాను డైరెక్ట్‌చేస్తున్నట్టుగా తెలుస్తొంది. రామ్‌ తళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.