మెగా కాంపౌండ్‌ నుంచి మరో హీరో

11:14 - October 27, 2018

మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో ఇండిస్టీకి పరిచయం కాబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంతో మెగా కాంపౌండ్‌ నుంచి మరో హీరో పరిచయం కానున్నారు. ఆయన మరెవరో కాదు.. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, సాయిధరమ్‌తేజ్‌ సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌. ఈ సినిమాకు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించనున్నారు. బుచ్చిబాబు సానా ఇంతకు ముందు సుకుమార్‌ దగ్గర దర్శకత్వశాఖలో పనిచేశారు. ఇటీవల ' రంగస్థలం ' చిత్రానికి రైట‌ర్‌గా కూడా పనిచేశారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతాన్ని స‌మ‌కూర్చ‌నున్నారు. ఈ నూత‌న చిత్రానికి ప‌నిచేసే ఆర్టిస్టులు, టెక్నీషియన్ల పేర్లను త్వరలోనే వెల్లడించనున్నారు.