మృత్యువుతో పోరాడుతున్న హరికృష్ణ... సెల్ఫీలు దిగుతున్న ఆసుపత్రి సిబ్బంది

16:04 - August 31, 2018

కొనఊపిరితో ఉన్న హరికృష్ణను కామినేని ఆస్పత్రికి తీసుకువచ్చారు. క్షణాల్లో లైఫ్ సపోర్టుమీద ఉంచాల్సిన సిబ్బంది సెల్ఫీలు తీసుకుంటూ కాలం గడిపిన విషయం బయటకు వచ్చింది. వీరిని చూస్తుంటే... మనుషుల్లో కర్కశత్వం ఇంతగా పేరుకుపోయిందా? అనిపిస్తుంది.

ఒక పక్క మృత్యుతో పోరాడుతున్న వ్యక్తికి వైద్యం అందించకుండా...వారితో సెల్ఫీలు దిగేంతగా వీరి మనసిక స్థితి దిగజారింది. అంబులెన్స్ శబ్దం వినిపిస్తే రోడ్డుపై వెళ్లేవాళ్లు వీలైనంత వరకు దారి ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. తాము ఎంత అర్జంట్ పనిమీద ఉన్నా పక్కకు తప్పుకుంటారు. కానీ ఆసుపత్రిలో సిబ్బంది ఏం చేస్తున్నారు. రోగి చికిత్స విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. అదే వీఐపీ రోగులు అయితే సెల్ఫీలు కూడా తీసుకుంటున్నారు. కామినేని ఆసుపత్రిలో అదే జరిగింది. హరికృష్ణ భౌతిక కాయంతో ఆసుపత్రి సిబ్బంది టెన్షన్ పడకుండా సెల్ కెమెరావైపు చూస్తూ సెల్ఫీలు తీసుకోడం పై సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.