మూడు భాషల్లో ' మణికర్ణిక '

13:16 - December 12, 2018

వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జీవితచరిత్ర ఆధారంగా రూపొందుతోన్న 'మణికర్ణిక' సినిమాలో కంగనా రనౌత్  ప్రధాన పాత్రను పోషిస్తోంది. మొదటి నుంచి కూడా కంగనా రనౌత్ వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె ఈసారి చారిత్రక నేపథ్యంతో ముడిపడిన కథాంశాన్ని ఎంచుకుంది. ఈ సినిమాను హిందీతోపాటు తెలుగు .. తమిళ భాషల్లో జనవరి 25వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి చాలావరకూ క్రిష్ దర్శకత్వం వహించగా, ఆ తరువాత దర్శకత్వ బాధ్యతలను కంగనానే చూసుకుంటూ వస్తోంది. శంకర్ ..  ఎహసాన్ .. లాయ్ .. సంగీతం ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలుస్తుందని భావిస్తున్నారు. ఈ  నెల 18వ తేదీన ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా తన కెరియర్లో ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుందనే ఆశాభావంతో కంగనా వుంది.