మూడు నెలల్లో పంచాయితీ ఎన్నికలు

12:23 - October 11, 2018

రాష్ట్రంలో అసెంబ్లీ రద్దుతో ముందస్తు ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల పోలింగ్‌ కూడా డిశంబర్‌ 7గా నిర్ణయమైంది. ఇదిలా వుంటే పంచాయితీ ఎన్నికలు కూడా ఇప్పుడు తెరమీదకు వచ్చాయి. దీంతో ఇప్పుడు నాయకులకు రెండు పనులు ఒకే సారి చేయాల్సి వచ్చింది. మరో మూడు నెలల్లో పంచాయితీ ఎన్నికలు నిర్వహించబడనున్నాయి. తెలంగాణలో పంచాయితీ ఎన్నికలపై హైకోర్టు ఈరోజు కీలక ఉత్తర్వులు వెలువరించింది. వచ్చే మూడు నెలల్లోపు అన్ని పంచాయితీలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. ఈ మూడు నెలల లోపు ప్రత్యేక అధికారుల సేవలను కొనసాగించుకోవచ్చని న్యాయం స్థానం తెలిపింది. అయితే అప్పటిలోగా ఎన్నికలకు పూర్తి ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.