ముస్లిం అభ్యర్థులకు ఒక్క టిక్కెట్‌ కూడా ఇవ్వని బీజేపీ

15:07 - November 16, 2018

బీజేపీ ఈసారి హిందుత్వ నినాదంతో ముందుకెల్తుందట! అవునండీ..ఇది నిజమే. డిశంబర్‌ 7 న రాజస్థాన్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వ్యూహం ఇదే. అందుకే 162మంది అభ్యర్థుల్లో ఒక్క ముస్లిమ్ అభ్యర్థికి కూడా బీజేపీ సీటు ఇవ్వలేదు.  రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హిందూత్వ కార్డును ప్రయోగిస్తుందని తాజా మాజీ ఎమ్మెల్యే రహమాన్ ఆరోపించారు. రాజస్థాన్ మంత్రి అయిన యూనుస్ ఖాన్ కు కూడా బీజేపీ టికెట్ ఇవ్వలేదు. పార్టీ టికెట్లు ఇవ్వకుండా ముస్లిమ్ ఓటర్ల వద్దకు తామెలా వెళ్లాలని బీజేపీ మైనారిటీమోర్చా విభాగం నాయకుడు సాధిక్ ప్రధాన మంత్రి మోదీకి రాసిన లేఖలో ప్రశ్నించారు. హిందూ, ముస్లిం అంటూ మతాల మధ్య చిచ్చుపెడుతున్న బీజేపీ నిజ స్వరూపం ఇప్పుడింకా తేటతెల్లమైంది.