ముందునుండి లేదట...ఇప్పుడే అలవాటు చేసుకుందట!

14:01 - October 30, 2018

ఉదయాన్నే లేవాలంటే కొంతమందికి చాలా కష్టంగా వుంటుంది, కానీ కొంతమందికి చాలా ఇష్టంగా వుంటుంది. అయితే ఈ బామకు మాత్రం ముందునుండి ఉదయాన్నే లేవటం అలవాటు లేదట!..కానీ ఇప్పుడు అది చాలా బాగుందని అలవాటుగా మార్చుకుందట! ఇంతకీ ఆ బామ ఎవరు?..అసలు విషియం ఏంటి? అనుకుంటున్నారా?. అయితే అసలు విషియానికి వస్తే...బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ ప్రభాస్ నెక్స్ట్ ఫిలిం 'సాహో' లోనే కాకుండా మరో సినిమాలో కూడా నటిస్తోంది. బాడ్మింటన్ ఛాంపియన్ సైనా నెహ్వాల్ బయోపిక్ లో శ్రద్ధ సైనా పాత్ర పోషిస్తోంది. దీంతో బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా సహజంగా కన్పించేందుకు ఇప్పటికే బ్యాడ్మింటన్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకుంది. ప్రతి రోజూ ఉదయాన్నే లేచి బ్యాడ్మింటన్ రాకెట్ పట్టుకుని కోర్టులో చెమటలు చిందిస్తోంది.  తన ప్రాక్టిస్ గురించి మాట్లాడుతూ రోజూ పొద్దున్నే నిద్రలేస్తున్నానని.. దీంతో రోజులో చాలా సమయం ఉందనిపిస్తోందని చెప్పింది.  "ఉదయం లేవడం భలేగా ఉంది.  ఈ సినిమా పూర్తయినా బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ మానను.. ఈ అలవాటుని అస్సలు వదలను" అని చెప్పింది.