మీ బండ్లకు నెంబర్‌ ప్లేటు లేదా...అయితే అంతే సంగతులు

11:59 - November 28, 2018

మీ బైక్‌లకు, కార్లకు, మీరు నడిపే వాహనాలు ఏదైనా కానీ..దానికి నెంబర్‌ ప్లేటు లేదా అయితే వెంటనే వేయించుకోండి..లేకుంటే మీకు సమస్యలు తప్పవుంటున్నారు రవాణా శాఖ అధికారులు. మీ బైక్‌ నెంబరు ప్లేట్‌పై మీ ఇష్టమైన నాయకుడి, హీరోల ఫొటోలు.. స్లోగన్‌లను ముద్రించారా..? అయితే వాటిని వెంటనే తీసేయండి. లేకుంటే భారీ జరిమానాలు విధించేందుకు.. లేదా ఏకంగా సీజ్‌ చేసేందుకు ట్రాన్స్‌పోర్టు, పోలీసు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే హోం మంత్రి చినరాజప్ప దీనిపై స్పష్టత ఇచ్చారు. ఎవరైనా వాహనం కొన్న వెంటనే సంబంధిత షోరూమ్‌లో రిజిస్ర్టేషన్‌ చేయించుకుని, కొద్దిరోజుల్లోనే నెంబర్‌ప్లేట్‌లు వేయించుకుని నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలి. వచ్చే నెల డిసెంబర్‌ ఒకటో తేదీ నుంచి కార్లు, భారీ వాహనాలకు నెంబర్‌ప్లేట్‌లు సరిగా లేకుండా తిరిగితే ముందుగా రూ.2 వేలు జరిమానా, రెండోసారి దొరికితే రూ.5 వేలు జరిమానా, మూడోసారి కోర్టుకు తరలిస్తారు. ద్విచక్ర వాహనాలు, చిన్న వాహనాలు నెంబర్‌ ప్లేట్లు లేకుండా మొదటిసారి దొరికితే వెయ్యి, రెండోసారి దొరికితే రూ.2 వేలు, మూడోసారి దొరికితే కోర్టుకు పంపిస్తాం. అక్కడ జరిమానాతోపాటు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. నెంబర్‌ప్లేట్లు సరిగా లేని వాహనాలను రిజిస్ర్టేషన్‌ లేని వాహనాలుగా నిర్ధారిస్తాం. ఆ కోణంలోనే జరిమానాలను విధిస్తాం. ప్రస్తుతం ప్రత్యేక టీమ్‌ల ద్వారా తనిఖీల ప్రారంభానికి సిద్ధమవుతున్నాం. నాలుగు రోజుల అనంతరం తనిఖీల పరంపర వేగంగా కొనసాగుతుంది. సంబంధిత పత్రాలు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకపోతే ఇకపై సీరియ్‌సగా చర్యలు తీసుకునేందుకు రవాణా శాఖ నిర్ధారించింది. వాహనం కొన్న వెంటనే ఆయా షోరూమ్‌ల్లో రిజిస్ర్టేషన్‌ను పక్కాగా చేయించుకుంటేనే సుఖమైన ప్రయాణం చేయగలరు. ఇటీవల ప్రతీ వాహనానికి ఇన్సూరెన్స్‌ను ఐదేళ్ళకు పొడిగించడం వల్ల చాలా రకాల ఇబ్బందులు తొలగాయి. ప్రతీ వాహనదారుడు ఐదేళ్ళకు సరిపడ ఇన్సూరెన్స్‌ చేయించుకుంటే వాహనం ఎటువంటి ప్రమాదంలో ఇరుక్కున్నా ఇబ్బందులు ఉండవు. దీన్నిపై ప్రతీ ఒక్కరూ స్పందించవలసిన అవసరం ఉంది.