మీటూ ఉద్యమంతో కూడా ఆగని వేదింపులు

16:53 - December 13, 2018

మీటూ- ఉద్యమం పోకడ తో వేధింపులు ఆగాయా? అంటే లేనేలేదని తాజా ఇన్సిడెంట్ ఒకటి చెబుతోంది. తనని వెంబడించి వేధించిన 30 ఏళ్ల ప్రొడక్షన్ డిజైనర్ రన్నింగ్ ఆటోలోంచి తోసేయడంతో సదరు స్టైలిష్ట్ గాళ్ కి తీవ్ర గాయాలవ్వడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. ఓ యువతి నవంబర్ 14న ముంబైలోని ఓ టీవీ ఫిలిం ప్రొడక్షన్ స్టూడియో లో ఉద్యోగానికి చేరింది. అయితే తన కు నైట్ డ్యూటీ కావడంతో అసలు సమస్య మొదలైంది. సదరు స్టైలిష్ట్ గాళ్ ని కొలీ గ్ హేమంత్ సోనావాలే వెంబడించి వేధించాడు. వేకువజామున 6.30 ప్రాంతంలో ఓ ఆటో లో వెళుతున్న తన తో పాటే అతడు అందులో ప్రయాణించాడు. రన్నింగ్ లో ఉండగానే తన భుజాల పై తల ఆన్చి మిస్ బిహేవ్ చేయడంతో వారించే ప్రయత్నం చేసింది.  ఆ తర్వాత సారీ చెప్పినా మరోసారి అదే టార్చర్. తనని బలవంతంగా ముద్దు పెట్టుకోబోతే ప్రతిఘటించిన తనని ఆటోలోంచి తోసేశాడు. దాంతో తన తలకు- కాలికి- శరీరం పై గాయాలయ్యాయి. దీంతో సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం పోలీసులు సోనావానేని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.