' మీటు ' దెబ్బకు దిగొచ్చిన కార్పోరేటు కంపెనీలు

15:05 - November 20, 2018

ప్రపంచమంతా సంచలనం సృష్టించిన 'మీటూ' దెబ్బకు కార్పొరేట్ కంపెనీలు దిగొచ్చాయి. ఆఫీసుల్లో ఎవరూ రొమాన్స్ చేయడానికి వీల్లేదని దాదాపు అన్ని కంపెనీలూ ఆంక్షలు విధించాయి. యూకేలో 20 కార్పొరేట్ సంస్థలు ఇటువంటి వ్యవహారాలపై పూర్తిగా నిషేధం విధించగా, 78 శాతం కంపెనీలు ఉద్యోగుల మధ్య ఉండాల్సిన సంబంధాల విషయంలో ఉన్న పూర్వపు నియమ నిబంధనలను సమీక్షించి, వాటిలో మార్పులను సూచించాయి. పని చేసే ప్రాంతాల్లో లైంగిక వేధింపులపై యువతులు చేస్తున్న ఫిర్యాదుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో పేరున్న పెద్ద కంపెనీలు ఆందోళనలో పడ్డాయని ఓ అధ్యయనం వెల్లడించింది. దాదాపు 80 మంది మానవ వనరుల విభాగాల అధికారులను ప్రశ్నించిన ఓ సంస్థ తమ అధ్యయనంలో తేలిన అంశాలను మీడియా ముందు ఉంచింది.