' మా ' ఈవెంట్‌ను క్యాన్సిల్ చేసుకున్న మహేష్‌

11:24 - September 6, 2018

అక్టోబర్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబుతో  ' మా ' సభ్యులు ఈవెంట్ ఫిక్స్ చేశారు. కానీ ' మా ' వివాదం చెలరేగిన నేపథ్యంలో మహేష్ ఈ ఈవెంట్‌ను క్యాన్సిల్ చేసుకున్నట్టు వార్తలు వినవస్తున్నాయి. వివాదాలకు దూరంగా ఉండే మహేష్ ఈ సమయంలో తాను ఈ షో చేయడం కరెక్ట్ కాదని భావిస్తున్నట్టు సమాచారం. మహేష్ ఈ ఈవెంట్ చేస్తే ' మా ' కు భారీ మొత్తంలో  నిధులు వస్తాయి. ఇప్పుడు మహేష్‌ ఈవెంట్‌ను క్యాన్సిల్ చేసుకోవడం  ' మా ' కు పెద్ద దెబ్బేనని తెలుస్తోంది.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) వివాదం పెద్ద దుమారాన్నే రేపింది.  ' మా ' అధ్యక్షుడు శివాజీరాజా నిధులను దుర్వినియోగం చేశారని ఓ ఆంగ్ల పత్రికలో కథనం ప్రచురితమైంది ' మా ' కార్యదర్శి నరేష్ కూడా ఆ కథనానికి మద్దతు తెలుపుతూ వ్యాఖ్యలు చేశారు. దీంతో' మా ' అసోసియేషన్ రెండుగా చీలి... ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంది. అమెరికాలో మెగాస్టార్ చిరంజీవితో నిర్వహించిన కార్యక్రమంలో కొంత డబ్బుని శివాజీ రాజా దుర్వినియోగం చేశారని, ఈ విషయంలో ఆయనకు  ' మా ' లో మరికొంతమంది మెంబర్స్ సహాయం చేశారని ఆరోపణలు వెళ్లివెత్తిన విషియం తెలిసిందే.