మార్కెట్‌లోకి మడత ఫోన్లు

16:15 - November 2, 2018

మార్కెట్‌లోకి మడత ఫోన్లు వచ్చాయి. నిజమేనండీ..నమ్మకం లేదా అయితే ఇది చదవండి. ప్రపంచంలోనే మొట్టమొదట 'ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌'ను (మడత స్మార్ట్‌ఫోన్‌) చైనా ఆవిష్కరించింది. చైనాకు చెందిన రారులీ కార్పొరేషన్‌ సంస్థ దీన్ని విడుదల చేసింది. తెరను మతడ పెట్టేందుకు వీలుగా దినిని రూపొందించారు. ఈ ఫోన్‌ను ప్రయోగాత్మకంగా రెండు లక్షల సార్లు మడత బెట్టి పరీక్షించామని అయినా డిప్ల్సేలో ఎలాంటి అవాంతరాలు ఎదురుకాలేదని చైనా సంస్థ తెలిపింది. కాబట్టి ఈ ఫోన్‌ తెరపై దృశ్యం ఏళ్ల పాటు ఏ అవాంతరం లేకుండా కనిపిస్తుందని సంస్థ వెల్లడించింది. తెర పైభాగంలో 16 ఎంపీ, 20 ఎంపీ సామర్థ్యం కలిగిన రెండు కెమెరాలను కంపెనీ ఏర్పాటు చేసింది. ఈ ఫోన్‌ను మడతబెట్టినప్పుడు వెనుక కెమెరాగా, మామూలుగా ఉంచినప్పడు ఫ్రంట్‌ కెమెరాగా పనిచేస్తుంది. దీనిని7.8 అంగుళాల తెర. 3,800 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యంతో సున్నిత ఆపరేషన్‌కు కూడా పని చేసేలా రూపొందించినట్టుగా కంపెనీ తెలిపింది. ఈ ఫోన్లు డిసెంబరు నుంచి చైనాలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నట్లు సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఈ తరహా ఫోన్‌లు ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థలైన శాంసంగ్‌, ఎల్‌జీ, హువారు సంస్థల వద్ద ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నాయి. అన్నట్టు ఈ మడత ఫోను ఖరీదెంతో తెలుసా..  ఫోన్‌ వేరియంట్‌ను బట్టి రూ.90 వేల నుంచి రూ.1.2 లక్షల మధ్య ఉండనున్నట్టుగా సమాచారం.