' మారి 2 ' ట్రైలర్‌లో ధనుశ్ డిఫరెంట్‌ లుక్‌

13:07 - December 5, 2018

ధనుశ్ తాజా చిత్రంగా 'మారి 2' చిత్రం నిర్మితమైంది. గతంలో ఘన విజయాన్ని అందుకున్న 'మారి' సినిమాకి ఇది సీక్వెల్.  మాస్‌ రాజాగా ధనుశ్ డిఫరెంట్ లుక్ తో .. స్టైల్ తో కనిపిస్తూ ఉండగా, ఆటో డ్రైవర్ గా సాయిపల్లవి కనిపిస్తోంది.  ఈ సినిమాను ఈ నెల 21వ తేదీన విడుదల చేయనున్నారు. మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. యాక్షన్ .. కామెడీ సన్నివేశాలపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. ఈ ట్రైలర్ సినిమా పై మరింతగా అంచనాలు పెంచుతుందనే చెప్పాలి. అంతేకాదు ఒక కీలకమైన పాత్రను వలక్ష్మీ శరత్‌కుమార్‌ పోషిస్తుంది. 'మారి' మాదిరిగానే 'మారి 2' కూడా మాస్ ఆడియన్స్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ధనుశ్ ఖాతాలో మరో హిట్ చేరిపోయినట్టేనని ఆయన అభిమానులు బలంగా చెబుతున్నారు.