మహేష్‌ సంఖ్యను విజయ్ దేవరకొండ బీట్‌ చేస్తాడట!

12:27 - December 17, 2018

విజయ్ దేవరకొండ ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోగా - మోస్ట్ క్రేజీ హీరోగా మారిపోయాడు. యూత్ లో విపరీతమైన క్రేజ్ ను దక్కించుకున్న విజయ్ దేవరకొండ సినిమాలు మాత్రమే కాకుండా వరుసగా పలు బ్రాండ్స్ కు అంబాసిడర్ గా వ్యవహరించేందుకు సిద్దం అవుతున్నాడు. తెలుగు హీరోల్లో బ్రాండ్ అంబాసిడర్ అనగానే అంతా కూడా ఠక్కున మహేష్ ను గుర్తు తెచ్చుకుంటారు. తెలుగులో ఆయన ప్రమోట్ చేసిన కంపెనీల సంఖ్య ను మరే హీరో చేరుకోలేడు. అంతగా మహేష్ బాబు బ్రాండ్స్ కు అంబాసిడర్ గా వ్యవహరించాడు. మహేష్ తర్వాత ప్రస్తుతం అంతటి క్రేజ్ ను - అంతటి బ్రాండ్స్ సంఖ్యను కలిగి ఉన్న అంబాసిడర్ విజయ్ దేవరకొండ అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం పలు కంపెనీలకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విజయ్ దేవరకొండను ఇంకా పలు సంస్థలు కూడా సంప్రదిస్తున్నాయి. వచ్చే ఏడాది ఆరంభం నాటికి ఈయన బ్రాండ్స్ సంఖ్య డజను అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని మార్కెట్ వర్గాల వారు అంటున్నారు. భారీ మొత్తంలో పారితోషికం తీసుకోకుండా తన స్థాయికి తగ్గ పారితోషికంను మాత్రమే ఆయన తీసుకుంటూ యాడ్స్ లో నటిస్తున్న కారణంగా ఆయనతో తమ ఉత్పత్తులకు ప్రచారం చేయించుకునేందుకు పలు కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఇదే స్థాయిలో విజయ్ దేవరకొండ యాడ్స్ చేస్తూ వెళ్తే కొంత కాలంలోనే మహేష్ బాబు సంఖ్యను బీట్ చేసినా ఆశ్చర్య పోనక్కర్లేదని మార్కెట్‌ వర్గాల వారు అంటున్నారు.